Advertisement
Google Ads BL

BB 7: అమర్ దీప్ పై ట్రోలింగ్

amardeep | BB 7: అమర్ దీప్ పై ట్రోలింగ్

బిగ్ బాస్ సీజన్ 7 లోకి టైటిల్ ఫెవరెట్ గా దిగిన సీరియల్ ఆర్టిస్ట్ అమరదీప్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పిల్లిలా మారి ఆట చేతకానివాడిలా మారిపోయాడు. హౌస్ లో మోస్ట్ అమాయకపు చక్రవర్తి ఎవరు అంటే అమరదీప్ అంటారు. గత రాత్రి ఓ టాస్క్ లో అమరదీప్ ని చూసి నెటిజెన్స్ మాత్రమే కాదు.. హౌస్ మేట్స్ కూడా అమరదీప్ అమాయకత్వాన్ని రరకాలుగా కామెంట్స్ చేసారు. 

Advertisement
CJ Advs

ఇక అమరదీప్ మొదటి వారంలోనే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విషయంలో చేసిన తప్పిదం అమర్ ని మరింతగా కిందకి దిగజార్చింది. ఇక టాస్క్ లు అర్ధం కాకపోవడం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ప్రత్యేకంగా అమరదీప్ ఆటని వేలెత్తి చూపించడం ఇవన్నీ అమరదీప్ ని మరింతగా డ్యామేజ్ చేసాయి. అయితే హౌస్ బయట కూడా అమరదీప్ ని నెటిజెన్స్ ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. 

అమరదీప్ పై ట్రోలింగ్ తో ఆయన తల్లి మధనపడుతూ ఓ వీడియో విడుదల చేసింది. అమరదీప్ పై ట్రోలింగ్ ఆపమంటూ వేడుకుంటుంది. అమర్ చాలా మంచివాడు. ఎవరికీ ఎలాంటి అన్యాయం చెయ్యడు, అతను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అలాంటి అమర్ ని ఇలా మాట్లాడడం సరికాదు. నేను రైతు బిడ్డనే. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే, అమర్ కి పొగరు అంటున్నారు. అది విని చాలా బాధేస్తుంది. అమర్ ని అర్ధం చేసుకోండి.. అతన్ని ట్రోల్ చెయ్యొద్దు అంటూ అమరదీప్ అమ్మ ఓ వీడియో విడుదల చేసింది. 

BB 7: Trolling on Amar Deep:

Big Boss Season 7 Contestant Amardeep Mother Emotional Video about Her Son 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs