Advertisement
Google Ads BL

బాబు పిటిషన్‌పై ఏం జరుగుతోందంటే..


టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్‌ హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. వాదనలన్నీ సెక్షన్‌ 17A చుట్టూ తిరుగుతున్నాయి.  

Advertisement
CJ Advs

వాదనలకు ఎంత సమయం కావాలని సాల్వేను కోర్టు అడగ్గా.. కనీసం గంట సమయం కావాలని హరీష్‌ సాల్వే అన్నారు. వారికి గంట సమయం అవసరమైనప్పుడు.. గంట తర్వాతే వస్తానంటూ కోర్టుకు ముకుల్ రోహత్గి చెప్పారు.

నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని.. బెంచ్‌ తేల్చాలని ముకుల్‌ రోహత్గి కోరారు. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హరీష్ సాల్వే అన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్ల ఆధారంగానే.. ఇక్కడ వాదనలు జరుగుతున్నాయని.. కాబట్టి కొత్త డాక్యుమెంట్లు అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబుకు 17A వర్తిస్తుందంటూ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17A చట్టసవరణ ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడమేనన్నారు. అవినీతి నిరోధంతో పాటు ప్రజాప్రతినిధులపై.. ప్రతీకార చర్యలు ఉండకూడదన్నదీ ప్రధానమేనని సాల్వే అన్నారు. 17A చట్ట పరిధిలోని అంశాలను సాల్వే కోర్టు ముందుంచారు. యశ్వంత్‌ సిన్హా కేసులో రఫేల్‌ కొనుగోళ్లు, అనంతరం దాఖలైన.. కేసులపై వచ్చిన తీర్పులను ఈ సందర్భంగా కోర్టులో ఉదహరించారు. రఫేల్‌ కేసులో జస్టిస్‌ జోసెఫ్‌ తీర్పును సాల్వే వివరించారు. ప్రజాప్రతినిధుల పాత్రపై విచారణ జరిపే ముందు..

గవర్నర్‌ అనుమతి తప్పనిసరంటూ సాల్వే వాదించారు.

What is happening on Babu petition?:

What is going on in the Supreme Court on Chandrababu petition..!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs