డిసెంబర్ 22 న హాయ్ నాన్న విడుదల చేస్తామంటూ హీరో నాని అందరికన్నా ముందే డేట్ లాక్ చేసి ప్రకటించాడు. ఆ సమయానికి వెంకీ-శైలేష్ కొలను మూవీ, ఆ తర్వాత నితిన్ ఎక్స్ట్రా మూవీస్ వచ్చి చేరాయి. అబ్బో ఇంట్రెస్టింగ్ ఫైట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 22 కి డైనోసార్ దిగుతుంది. ప్రభాస్ సలార్ డిసెంబర్ 22 కి డేట్ లాక్ చెయ్యడమో తరువాయి వెంకటేష్ జనవరి 13 సంక్రాంతికి వెళ్ళిపోయాడు.
నితిన్ ప్రీ పోన్ అంటూ డిసెంబర్ 8 కే ఎక్స్ట్రా తో వచ్చేస్తున్నాడు. కానీ నాని మాత్రం హాయ్ నాన్న ని ప్రమోట్ చేసుకుంటున్నాడు తప్ప సినిమా డేట్ లాక్ చెయ్యడం లేదు. హాయ్ నాన్న సింగిల్స్ వదులుతూ హడావిడి చెయ్యడం ఆపి ముందా రిలీజ్ డేట్ పని చూడండి నాని అంటూ ఆయన అభిమానులు సలహాలు ఇస్తున్నారు. డిసెంబర్ మొదటి వారమైనా ఓకే.. లేదంటే జనవరి మొదటి వారమైనా ఓకె.. అదేదో చూడు నాని అంటున్నారు.
నిజమే వెంకీ, నితిన్ లు తొందరపడి డేట్స్ లాక్ చేసేసారు. మరి నాని ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడా.. అందుకే డేట్ లాక్ చెయ్యలేకపోతున్నాడా.. నాని కూడా త్వరగా హాయ్ నాన్న రిలీజ్ డేట్ లాక్ చేస్తే బావుంటుంది అనేది నెటిజెన్స్ అభిప్రాయం.