కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ముందే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ మొదలు పెట్టేసారు. కానీ మధ్యలో శంకర్ కి ఇండియన్ 2 షూటింగ్ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి రావడంతో ఏడాదిన్నరగా.. రామ్ చరణ్ ఓ గేమ్ ఛేంజర్-కమల్ తో ఇండియన్ 2 షూటింగ్స్ చేసుకుంటూ వస్తున్నారు. అటు గేమ్ ఛేంజర్ ఇటు ఇండియన్ 2 షూటింగ్స్ ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు, విడుదల తేదీలు ఇవ్వడం లేదు.
మరోపక్క గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు శంకర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. బడ్జెట్ పెరిగిపోతుంది, రిలీజ్ డేట్ ఇవ్వలేదు, భారీ బడ్జెట్ సినిమా ఇది.. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక కామ్ గా ఉన్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ షూటింగ్ పై నెటిజెన్స్ సోషల్ మీడియాలో పలురకాల కామెంట్స్ చేస్తున్నారు.
కమల్ హాసన్ తో ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్న శంకర్.. ఆ సినిమా బ్రేక్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పెడుతున్న శంకర్. అసలు కొన్నాళ్లుగా గేమ్ ఛేంజర్ షూటింగ్ నిలకడగా జరగడం లేదు. అటు బడ్జెట్ ఖర్చు, ప్లస్ వడ్డీలు పెరుగుతున్నాయి, ఇంకా స్టార్ హీరో, గ్లోబ్ స్టార్ రామ్ చరణ్ విలువైన సమయం వృధా అవుతోంది. అయినా ఇక్కడ శంకర్ కాబట్టి ఎవరూ ఏమనలేకపోతున్నారు.
దిల్ రాజు అయితే ఏడవలేక నవ్వుతున్నాడు. ఇక చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ పెళ్ళీకాగానే బుచ్చిబాబు తో కొత్త సినిమా సెట్స్ మీదకి వెళ్తాడు అంటూ సోషల్ మీడియాలో రకరకాల నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.