ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ టాలీవుడ్ లో భీభత్సంగా కనిపిస్తుంది. పెళ్ళిసందD సినిమా షాకిచ్చినా ధమాకా మాత్రం శ్రీలీల క్రేజ్, ఆమె డాన్స్ ల వల్లే 100 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈఏడాది స్కంద తో హవా స్టార్ట్ చేసిన శ్రీలీల కి గత నెలలో విడుదలైన ఆ చిత్రం షాకిచ్చింది అనే చెప్పాలి. సెప్టెంబర్ 28 న విడుదలైన స్కంద బావుంది అన్నప్పటికీ.. ఈ సినిమాలో శ్రీలీల ని మేకర్స్ సరిగ్గా వాడుకోలేకపోవడమే కాదు.. ఆ సినిమా రిజల్ట్ కూడా పాపకి అంత అనుకూలంగా రాలేదు.
స్కంద ప్లాప్ ని పక్కనపడేసి ప్రస్తుతం భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది శ్రీలీల. అనిల్ రావిపూడితో కలిసి శ్రీలీల ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ హడావిడి మొదలు పెట్టింది. గత నెలలో స్కంద రిజల్ట్ ఇబ్బంది పెట్టినా ఈనెల్లో భగవంత్ కేసరి తో హిట్ కొట్టడం ఖాయమన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజే భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వేడుక జరగబోతుంది. ఈ చిత్రంలో ఇప్పటికే బాలయ్యతో కలిసి సాంగ్స్ లో ఇరగదీస్తోంది.
ఇక ఈ నెలలో భగవంత్ కేసరి వస్తుంటే వచ్చేనెల్లో ఆదికేశవ్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతుంది. డిసెంబర్లో నితిన్ ఎక్స్ట్రా మూవీతో ఈ యేడాదిని ముగించబోతుంది.