Advertisement
Google Ads BL

ప్రభాస్ లుక్ చూశారుగా: మారుతి


దర్శకుడు మారుతీ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా మొదలు పెట్టి ఆయన ఫ్యాన్స్‌కి పిచ్చ షాకిచ్చాడు. మారుతితో ప్రభాస్ అభిమానులు ఆందోళన పడని రోజు లేదు. రాజా డీలక్స్ అంటూ మారుతీ ప్రభాస్‌‌తో సినిమాని పట్టాలెక్కించడమే కాదు.. ప్రభాస్ గ్యాప్‌లో ఇస్తున్న డేట్స్‌తో షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్ ప్రకటన రాని ఈ సినిమాని వార్తలలో ఉంచేందుకు మధ్య మధ్యలో మారుతి కావాలనే ప్రభాస్‌తో చేస్తున్న సినిమా సెట్స్‌ని, ప్రభాస్ లుక్స్‌ని లీక్ చేస్తూ ఫ్యాన్స్‌ని కాస్త సమాధానపరుస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇప్పటివరకు మారుతి-ప్రభాస్ మూవీపై ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మధ్య మధ్యలో ప్రభాస్ లుక్స్ కావాలనే లీక్ చేస్తూ.. నేనూ ప్రభాస్‌తో సినిమా చేస్తున్నానని అనిపించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు మారుతి బర్త్‌డే స్పెషల్ ఇంటర్వూస్ లో ప్రభాస్ మూవీ విశేషాలు చెప్పమంటే.. ప్రభాస్ సినిమా విషయాలు చెప్పడానికి, లుక్ లు, అనౌన్స్ మెంట్ అవన్నీ యూనిట్ ఒక ప్లాన్ ప్రకారం చెబుతుంది. ఇప్పటికే లీకైన ప్రభాస్ లుక్ చూశారు. ఇంకా దాని గురించి కొత్తగా ఇప్పుడేమి చెప్పలేను. 

ఇక నేను ప్రభాస్ కారు డ్రైవ్ చేస్తూ కనిపించడం అనేది క్యాజువల్‌గా జరిగింది. ప్రభాస్ చెయ్యమంటేనే చేశాను. అది కూడా మీ అందరికి తెలిసిందే., అంటూ మారుతి ప్రభాస్ మూవీపై ఫాన్స్ కి ఎలాంటి చిన్న క్లూ కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు.

Maruthi Talks about Prabhas Raja Deluxe:

Maruthi about Prabhas Film at His Birthday Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs