Advertisement
Google Ads BL

BB7: ఓవరాక్షన్ చూడలేకపోతున్నారు


బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ మేట్స్ ఓవరాక్షన్ చూడలేక బుల్లితెర ప్రేక్షకులు చచ్చిపోతున్నారు. హౌస్ లోకి వచ్చి ఐదు వారాలు పూర్తి కాకుండానే కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన లెటర్స్ చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సందీప్ మాస్టర్ అయితే అమ్మో అతను ఎంతగా నటిస్తాడో అనుకునేంతగా ఏడ్చేశాడు. అసలు ఫ్యామిలీకి ఎప్పుడూ దూరంగా లేడా అనేలా జీవించాడు. ఇక పల్లవి ప్రశాంత్ అయితే చేప్పక్కర్లేదు. టేస్టీ తేజ కానివ్వండి, అమరదీప్ అయితే లెటర్ చదవకుండానే ఏడ్చేశాడు. 

Advertisement
CJ Advs

ఇక గౌతమ్-సుబ్బు మధ్యన వాగ్వాదం, కెప్టెన్సీ టాస్క్ గురించి జరిగిన డిస్కర్షన్, సుబ్బు ఏడుపు, గౌతమ్ ఏడుపు చూడలేము అన్నట్టుగా చేసారు. అసలు నిజంగా వీరంతా లైఫ్ లో ఇంతవరకు ఫ్యామిలీ దూరంగా లేరా.. వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ ని బట్టి ఎక్కడో ఒక చోటకి వెళ్ళలేదా.. ఏదో ఇక్కడే ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టుగా అతి చేసారు. వారు ఏడుపు కేవలం సింపతీ కోసమేనా అన్నట్టుగా చేసారు. 

ఇదంతా వద్దు అనుకునే శివాజీ ఈ ఆట ఆడను బిగ్ బాస్ అంటూ మొహం మీదే చెప్పాడు. అంత అతి చెయ్యలేకే శివాజీ మంచి డెసిషన్ తీసుకున్నాడని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ హౌస్ మేట్స్ లోని కొంతమంది అతి బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం చిరాకు తెప్పించేసింది అనడంలో సందేహమే లేదు.  

BB7: Baboy cannot see the overaction:

Bigg Boss 7: Friday episode highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs