టాలీవుడ్ లో నేడు అరడజనకు పైగా సినిమాలు విడుదలయ్యాయి. అక్టోబర్ 6న డబ్బింగ్ మూవీస్, చిన్న చిత్రాల హడావిడి బాగా కనిపించింది. రెండు రోజుల ముందు నుంచే హైదెరాబాదులో ప్రెస్ ప్రీమియర్స్ అంటూ మేకర్స్ హంగామా చేసారు. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజాన్, ముత్తయ్య మురళీధరన్ 800 డబ్బింగ్ మూవీ, సుధీర్ బాబు మామ మచ్చింద్ర, నవీన్ చంద్ర-స్వాతి మంత్ అఫ్ మధు, సిద్దార్థ్ చిన్న, సంగీత్ శోభన్, నార్ని నితిన్ ల మ్యాడ్ మూవీ, ఇలా చాలా సినిమాలు విడుదలయ్యాయి.
అందులో ఇప్పటివరకు జరిగిన ప్రెస్ ప్రీమియర్స్ లో 800 మూవీకి హిట్ టాక్ రాగా.. గత రాత్రి వేసిన మ్యాడ్ మూవీ ప్రీమియర్ చూసాక సినిమా చాలా బాగుంది అంటూ సోషల్ మీడియాలో పలువురు జర్నలిస్ట్ లు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ అఫ్ అదిరిపోయింది.. సంగీత్ శోభన్ కామెడీ సూపర్బ్, రఘుబాబు, అల్లరి నరేష్ తర్వాత సంగీత్ శోభన్ అంత బాగా కామెడీ పండించాడంటూ కితాబునిస్తున్నారు.
మిగతా సినిమాల ప్రీమియర్స్ కి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ అరడజను సినిమాల్లో 800, ఇంకా మ్యాడ్ చిత్రాలకే హిట్ టాక్ వచ్చింది. కానీ ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందు నిలబడతాయా.. 800 డబ్బింగ్ మూవీ, మ్యాడ్ చిన్న చిత్రం, ఎంత సితార బ్యానర్ నుంచి వచ్చినా అది చిన్న సినిమాగానే ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. హిట్ టాక్ వచ్చేసింది అని ఊరుకోకుండా.. ఇంకాస్త ప్రమోట్ చేస్తే ఈ చిత్రాలు ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ సాధించడం పక్కా.
ఈమధ్య కాలంలోనే మనం చూస్తున్నాం ఖుషి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, స్కంద వంటి సినిమాలకి పాజిటివ్ టాక్ హోరెత్తిపోయినా కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయి. అంతంత ప్రమోట్ చేసుకుంటూ వచ్చినా అంతమాత్రం కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓ రేంజ్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ లేకపోతే థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించలేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆడియన్స్ కూడా ఎక్కువ ఎగ్జైట్ అయితేనే థియేటర్స్ వైపు కదులుతున్నారు, లేదంటే ఓటిటి కోసం వెయిట్ చేస్తున్నారు. సో.. ప్రేక్షకులని ఆకర్షించే ప్రయత్నాలు ఇంకాస్త ఎక్కువ చెయ్యాలి మేకర్స్ సినిమాకి మౌత్ టాక్ బావున్నా సరే!