కళ్యాణ్ కృష్ణ తో మెగాస్టార్ మలయాళంలో హిట్ అయిన బ్రో డాడి మూవీని రీమేక్ చేద్దామనుకున్నారు. అప్పుడే మెగా ఫాన్స్ గగ్గోలు పెట్టారు. కానీ మెగాస్టార్ చిరు అప్పుడు ఎవరి మాటా వినే స్థితిలో లేరు. కానీ భోళా శంకర్ రిజల్ట్ తర్వాత చిరు కళ్యాణ్ కృష్ణ తో రీమేక్ చేసే ఆలోచన విరమించుకున్నారు. అలాగే కళ్యాణ్ కృష్ణని కూడా పక్కకి తప్పించారనేలా ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టు కి నిర్మాతలని ప్రకటించినా దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ పేరు మాత్రం వెయ్యలేదు.
అప్పటినుండి కళ్యాణ్ కృష్ణ అసలు మెగా 156 లో ఉన్నాడో.. లేదో.. అనేది క్లారిటీ రావడమే లేదు. తాజాగా పూర్తిగా కొత్త కథతో కళ్యాణ్ కృష్ణ-మెగాస్టార్ సినిమా ఉండబోతుంది.. రీమేక్ పాయింట్ తో చేద్దాం అనుకున్న ఐడియా పక్కన పెట్టారు అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ ఉండడంతో మెగా ఫాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
ఫైనల్లీ చిరంజీవి రీమేక్స్ ని పక్కనపెట్టయడం కొత్త కథతో మెగా 156 ని సెట్ చేయడం అలాగే మెగా 157ని బింబిసార డైరెక్టర్ వసిష్ఠ తో నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టెయ్యబోతున్నారు.. అని తెలిసాక ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిరు కూల్ గా రెస్ట్ తీసుకుంటూ కొత్త కథలు వింటున్నట్లుగా తెలుస్తోంది.