యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ సీక్వెల్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. బాహుబలి రెండు పార్టులు హిట్ అవడంతో.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ ప్రకటించారు. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. ఇక పుష్ప మూవీని సుకుమార్-అల్లు అర్జున్ లు ఒక పార్ట్ గానే మొదలు పెట్టినా షూటింగ్ మిడిల్ లోకి వచ్చేసరికి అది రెండు పార్టులై కూర్చుంది. ఇక ప్రభాస్ సలార్ కూడా రెండు భాగాలుగానే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని ఎన్టీఆర్-కొరటాల ఫాలో అవుతున్నారు.
దేవర రెండు భాగాలుగా విడుదల చేస్తాము, మొదటి భాగం ఏప్రిల్ 5 విడుదల అంటూ కొరటాల శివ వీడియో బైట్ తో కన్ ఫర్మ్ చేసారు. దేవర కథ రాసుకున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాము.. అన్ని స్ట్రాంగ్ కేరెక్టర్స్. షూటింగ్ చేస్తున్నప్పుడు అందులో పాత్రలని డెప్త్ తో చూపించాలనుకున్నాము, ముందుగా దేవర ఒక్క పార్ట్ అనే అనుకున్నాము, కానీ ప్రస్తుతం చిత్రీకరించిన సీన్స్ లో ఏ సీన్, ఒక్క డైలాగ్ కూడా తీసెయ్యలేము, ఏదో ఆదరాబాదరాగా ఒక్క పార్ట్ లో కథ ముగించేద్దాము అనేది కరెక్ట్ కాదు.
అందుకే దేవరాని రెండు పార్ట్ లుగా తీసి ప్రతి కేరెక్టర్ ని డెప్త్ గా చూపించాలని డిసైడ్ అయ్యి.. మొన్ననే ఓ డెశిషన్ తీసుకున్నాము, అదే మీకు షేర్ చేస్తున్నాను. దేవరాలో స్ట్రాంగ్ కేరెక్టర్స్ మధ్యన జరిగే సన్నివేసాలను రెండు భాగాలుగా అందించబోతున్నాము ఎన్టీఆర్ ఫాన్స్ కి, మూవీ లవర్స్ కి అంటూ కొరటాల చెప్పారు.