వ్యాక్సిన్ వార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అనవసరంగా ప్రభాస్ ఫాన్స్ ని కెలికారు. వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పలుమార్లు అనుచిత కామెంట్స్ చేశాడు. అప్పట్లో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో రాధే శ్యామ్ చిత్రాన్ని దెబ్బ తీశాను. ది వాక్సిన్ వార్ మూవీతో సలార్ ని ప్లాప్ చేస్తానని వివేక్ అన్నట్లుగా వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ట్వీట్స్ పడడంతో.. ప్రభాస్ ఫాన్స్ ఫైర్ అయ్యారు. అంతేకాదు వివేక్ ఆదిపురుష్ మూవీపై కూడా వివేక్ అగ్నిహోత్రి అనుచిత కామెంట్స్ చేశాడు.
ఎవరిని పడితే వాళ్ళను రాముడు అంటే జనాలు అంగీకరించరు. కనీస పరిజ్ఞానం లేకుండా ఆదిపురుష్ తెరకెక్కించారని వివేక్ అగ్నిహోత్రి అప్పట్లో చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అవ్వగా.. ప్రభాస్ అభిమానులు వివేక్ పై కత్తి కట్టారు. ఆయన తెరకెక్కించిన వ్యాక్సిన్ వార్ పై సలార్ కావాలనే పోటీకి దించారు.. డీనిని కూడా ప్లాప్ చేస్తానంటూ వివేక్ అన్నట్లుగా ప్రచారం జరగడంతో ప్రభాస్ ఫాన్స్ ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసారు. అయితే ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన వ్యాక్సిన్ వార్ సెప్టెంబర్ 28 న విడుదలై డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది. కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ డాక్యుమెంటరీ స్టైల్ లో తీయడం ప్రేక్షకులకు నచ్చలేదు. దానితో ప్రేక్షకులు లేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.
ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించడం కోసం ఎన్ని ప్లాన్స్ చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. దానితో ఈ చిత్రం భారీ డిసాస్టర్ దిశగా వెళ్లడంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రభాస్ ని అనవసరంగా వివాదంలోకి లాగి ఫాన్స్ తో పెట్టుకుని ఇప్పుడు డిసాస్టర్ కొట్టారంటూ వారు వివేక్ అగ్నిహోత్రిపై కామెంట్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.