పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో నష్టపోతే తారక్ అన్న అరవింద సమెతతో సేవ్ చేశాడంటూ ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ బ్యానర్ లో తెరకెక్కిన మ్యాడ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈరకమైన వ్యాఖ్యలు చేసాడు. కొన్ని ఛాలెంజింగ్స్ ఉంటాయి.. అవి కొన్నిసార్లు వర్కౌట్ అయితే.. కొన్నిసార్లు ముంచేస్తాయన్నాడు.
అలాంటి ఛాలెంజింగ్ మూమెంట్ అజ్ఞాతవాసి.. జనవరిలో విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తమని బాగా ఇబ్బందిపెట్టింది, రెండు నెలల పాటు దాని నుంచి బయటిరలేకపోయాము, అప్పడు తారక్ అన్న మాకు చాలా హెల్ప్ చేసాడు. ఒక సినిమా చేసి హిట్ కొట్టి చూపిద్దామంటూ ఎంకరేజ్ చేసాడు. అదే ఏడాది తారక్ అన్నతో సినిమా చేసి హిట్ కొట్టాము.
అరవింద సమెత తో తారక్ అన్న మమ్మల్ని ఒడ్డున పడేసాడు. అరవింద సమెతతో కొంతవరకు కోలుకున్నామంటూ ఈ కుర్ర నిర్మాత చెప్పాడు. ఇక తమ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ లో తెరకెక్కిన సినిమాల్లో అలా వైకుంఠపురములో సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పిన నాగవంశీ.. మధ్య మధ్యలో గుంటూరు కారం అప్ డేట్స్ ఇస్తూ మహెష్ అభిమానులని ఫుల్ ఖుషీగా చేస్తున్నాడు.