శ్రీదేవి బోని కపూర్ ని వివాహం చేసుకోకముందే ప్రెగ్నెంట్.. పెళ్ళికి ముందే శ్రీదేవి జాన్వీ కపూర్ కి జన్మనిచ్చింది అనే వార్త ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. బోని కపూర్ భార్యతో ఉండగానే శ్రీదేవితో కలిసి ఉండేవాడు.. ఆ క్రమంలోనే శ్రీదేవి ప్రెగ్నెంట్ అవడంతో వారు హడావిడిగా పెళ్లి చేసుకున్నారని అంటారు. తాజాగా బోని కపూర్ శ్రీదేవి మరణంపై, అలాగే శ్రీదేవి పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అన్న వార్తలపై స్పందించారు.
నేను శ్రీదేవి 1996 లో షిరిడీలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నాము, ఆ విషయం తర్వాత బయట పెట్టాము, అయినా 1997 జనవరిలో మేము అందరి సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నాము, అప్పుడు మా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాము. అయితే అప్పటికే శ్రీదేవి ప్రెగ్నెంట్. 1997 మార్చ్ లో జాన్వీ కపూర్ పుట్టింది. మా పెళ్లి షిర్డీలో జరిగిన విషయం చాలామందికి తెలియక పెళ్ళికి ముందే శ్రీదేవి ప్రెగ్నెంట్ అని అందరూ అనుకున్నారు.
జాన్వీ కపూర్ మా పెళ్ళికి ముందే పుట్టింది అనే రూమర్స్ అప్పుడే కాదు.. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. జాన్వీ కపూర్ పుట్టిన రోజు గురించి చెప్పినా ఆ రూమర్స్ ఇప్పటికి ఆగడం లేదు.. అని చెప్పిన బోని శ్రీదేవికి దైవ భక్తి ఎక్కువ.. అందుకే ఆమె బర్త్ డే కి తాము ఎక్కువగా తిరుమల వెళ్లేవాళ్లమని చెప్పారు.