మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. మోకాలి ఆపరేషన్ తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. నవంబర్ నుంచి వసిష్ఠ తో మెగా156 మూవీ ని మొదలు పెట్టబోతున్నారు. అయితే మెగా 156 డైరెక్టర్ పై ఇప్పుడు ఇంకా సస్పెన్స్ నడుస్తుంది. కళ్యాణ్ కృష్ణ తో మెగా 156 పట్టాలెక్కాల్సి ఉన్నప్పటికి భోళా శంకర్ రిజల్ట్ తర్వాత చిరు మనసు మార్చుకున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ నెక్స్ట్ లైనప్ కోసం కథలు వింటున్నారు. బ్యానర్ ప్రకటించినా ఇంకా కథ కానీ, డైరెక్టర్ కానీ ఏది లాక్ అవ్వలేదని తెలుస్తోంది. అక్టోబర్ నెలాఖరికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న #Mega156 నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.. అని సమాచారం
అయితే మెగా 156 కి దర్శకుడిగా చిరుతో జత కట్టే దర్శకుడిపై రోజు రోజుకు మెగా ఫాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతుంది. స్కంద డైరెక్టర్ బోయపాటి పేరు తెరపైకి వచ్చినా.. అది మెగా 158 ప్రాజెక్ట్ కి ఉండే అవకాశం నుండి అంటున్నారు. ప్రస్తుతమైతే ఆ మెగా 156 డైరెక్టర్ గురించే అందరి ఆత్రుత, క్యూరియాసిటీనూ.. మరి ఆయనెవరో తెలిస్తే కానీ.. మెగా ఫాన్స్ కూల్ అయ్యేలా లేరు.