జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో కామెడీ చేసే ఫైమా అందం కానీ, ఆకర్షణ కానీ లేకపోయినా తన టాలెంట్ తో కామెడీతో బుల్లితెర ప్రేక్షకుల మనసులని దోచుకుంది. భాస్కర్ స్కిట్ ద్వారా కమెడియన్ గా ఈటీవీలో తెగ ఫేమస్ అయిన ఫైమా గత ఏడాది స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ లోను తనదైన కామెడీతో ఆకట్టుకుంది.
సన్నగా ఉన్నా విల్ పవర్ ఉంటుంది.. అంటూ తన స్టామినా చూపిస్తూ బిగ్ బాస్ లో టాప్ 5 వరకు పోరాడి చివరి వారంలో ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత స్టార్ మాలో BB జోడితో సూర్య తో కలిసి డాన్స్ లో ఇరగదీసిన ఫైమా గత నెలలో కొత్తింటి గృహప్రవేశం చేసి తన కలను సాకారం చేసుకుంది.
అయితే బిగ్ బాస్ కి వెళ్లి ఏడాది అగ్రిమెంట్ పూర్తి కాగానే ఫైమా మరోసారి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ పై కామెడీ చేస్తూ కనిపించింది. అది కూడా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లోనే కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే శుక్రవారం జబర్దస్త్ స్టేజ్ పై మళ్ళీ ఫైమా కామెడీ ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి.