Advertisement
Google Ads BL

టైగర్ పక్కా ప్లానింగ్‌.. ముంబైలో దిగేశాడు


బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, కెజిఎఫ్ చిత్రాలు చూశాకా.. అందరూ పాన్ ఇండియా మూవీ అంటూ ప్రకటించడం దానికి అనుగుణంగా ప్రమోషన్స్ చేయలేక నామమాత్రంగా వాటిని ముగించి పాన్ ఇండియాలోని పలు భాషల్లో మూవీని విడుదల చెయ్యడం.. అది తెలుగులో ఆడినా, మిగతా భాషల్లో ప్లాప్ మూవీస్ గా మిగిలిపోవడం అనేది నిన్నమొన్నటి స్కంద వరకు చూస్తూనే ఉన్నాం. సినిమాని పాన్ ఇండియా రిలీజ్ అంటూ గొప్పగా ప్రకటించడం ఆ తర్వాత ప్రమోషన్స్ విషయం లైట్ తీసుకోవడం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

కానీ టైగర్ నాగేశ్వరావు అలా కాదు.. పక్కా ప్లానింగ్‌తో ప్రమోషన్స్‌ని పాన్ ఇండియాలో మొదలు పెడుతున్నాడు. రవితేజ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు. టైగర్ నాగేశ్వరావుతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు ఈనెల 20న దసరా స్పెషల్‌గా రాబోతున్నాడు. పాన్ ఇండియా అంటే అందుకు తగిన ప్రమోషన్స్ ఉండాలి. అందుకే రవితేజ ముంబైలో టైగర్ ట్రైలర్ లాంచ్ వేడుకకి రెడీ అయ్యి ఫ్లైట్ ఎక్కేశాడు. 

టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ లాంచ్ వేడుకని ముంబై వేదికగా నిర్వహించబోతున్నారు. మంగళవారం 12 గంటలకి టైగర్ నాగేశ్వరావు ట్రైలర్ లాంచ్ వేడుకని ముంబై‌లోని రిపబ్లిక్ మాల్‌లో నిర్వహించబోతున్నారు. టీం తో సహా రవితేజ ముంబై పయనమయ్యాడు. పాన్ ఇండియా అని ప్రకటించడమే కాకుండా.. పక్కా ప్లానింగ్‌తో టైగర్ ప్రమోషన్స్‌ని రవితేజ స్టార్ట్ చేసినట్లే అని చెప్పుకోవచ్చు.

Ravi Teja Starring Tiger Nageswara Rao Promotions Starts in Mumbai:

Tiger Nageswara Rao Trailer Launch at Mumbai Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs