అతిలోకసుందరి శ్రీదేవి ఆ మధ్య దుబాయ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీదేవి మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తల్లడిల్లిపోయారు. అప్పట్లో ఆమె మృతిపై పోలీసులు సైతం పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ బోనీ కపూర్ మాత్రం భార్య మరణం పట్ల బాధపడ్డారు కానీ.. ఆమె మృతిపై ఎలాంటి అనుమానాలను వ్యక్తపరచలేదు, అసలెక్కడా శ్రీదేవి మరణం గురించి మాట్లాడలేదు.
అయితే మొదటిసారి బోనీ కపూర్ భార్య మరణంపై స్పందించారు. శ్రీదేవి కఠిన ఆహార నియమాలు ఆమె మరణానికి కారణమన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఉప్పు కారం లేని ఆహారం తీసుకోవడం వలన శ్రీదేవి తరచూ కళ్ళు తిరిగిపడిపోతూ ఉండేదని.. అలానే ఆమె మరణం యాక్సిడెంటల్ అంటూ చెప్పారు. శ్రీదేవి అందం కోసం కఠిన ఆహార నియమాలను పాటించేది. దాని కోసం ఉప్పు, కారం లేని ఆహారాన్ని మితంగా తీసుకునేది.
అందంగా ఉండాలి, శరీరం మంచి షేప్‌లో ఉండాలి అని కఠినంగా ఆహారనియమాలని పాటించేది. శ్రీదేవికి బీపి ఉంది. ఆహార నియమాలని మార్చుకోవాలని డాక్టర్స్ చాలాసార్లు చెప్పారు, అప్పుడప్పుడు శ్రీదేవికి కళ్ళు తిరుగుతూ ఉండేవి. ఆహారం కోసం ఆమె అలమటించేది. కానీ తన తీరు మార్చుకునేది కాదు.. ఆమె మరణం ఓ యాక్సిడెంటల్ అంటూ బోనీ కపూర్ భార్య శ్రీదేవి గురించి చెప్పుకొచ్చారు. అలా కళ్ళు తిరిగి పడిపోయే బాత్ టబ్‌లో మరణించినట్టుగా శ్రీదేవి మరణంపై బోనీ మొదటిసారి ఇలా స్పందించారు.