Advertisement
Google Ads BL

పాపం రతిక భలే బుక్కయ్యింది


బిగ్ బాస్ సీజన్ 7 నుంచి నాలుగో లేడీ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యి.. ఊహించని విధంగా బయటికి వచ్చిన గ్లామర్ బ్యూటీ రతిక, తన ఎలిమినేషన్ ఏమైనా ఫ్రాంక్ ఏమో అని ఆశపడింది. నాగార్జున ఫేక్ ఎలిమినేషన్ అంటారనుకుంది. కానీ స్టేజ్ పై నిలబెట్టి ఇంటికెళ్ళమన్నారు.. దానితో ఇంటికి వెళ్లేముందు రతిక బీబీ బజ్‌లో గీతూ రాయల్ ఇంటర్వ్యూ‌కి వెళ్ళింది. అక్కడ గీతూ అడిగిన ప్రశ్నలకి రతిక తెల్లమొహం వెయ్యడమే తక్కువ. 

Advertisement
CJ Advs

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ఫ్రెండ్ షిప్ చేసి.. ఆ తర్వాత అతనికి వెన్నుపోటు పొడిచావా.. బాహుబలిలో కట్టప్పనే మించిపోయావ్ అంటూ ఇంటర్వ్యూ మొదలు పెట్టగా రతిక బిక్క సచ్చిపోయింది. నేను ఎవరిని వెన్నుపోటు పొడిచా అంది.. ప్రశాంత్ విషయంలో చెయ్యి అందించింది మీరు అనగానే.. నేనా అంది రతిక. దానికి గీతూ మీరు హౌస్‌లోనే కాదు ఇక్కడ కూడా మ్యానిప్యులేట్ చేస్తున్నారని అంది. 

హౌస్‌లో ఎక్స్ అనే ఎమోషన్‌ని బాగా వాడినట్లుగా అనిపించింది.. అయినా మీకు వాడుకోవడం బాగా అలవాటేగా అంటూ గీతూ కాస్త ఘాటుగానే అడిగింది. ఆ మాటకి నిజంగా రతిక బిత్తరపోవడమొక్కటే తక్కువ. వాడుకునే అలవాటుంటే ఆ సమయం వచ్చినప్పుడే వాడుకునే దాన్ని అంది. ప్రశాంత్ క్రయింగ్ స్టార్ - రతిక కన్నింగ్ స్టార్, ఫ్లిప్పింగ్ స్టార్.. రతిక కన్నా పాము నయం అంటూ నెటిజన్స్ రతికని అన్న కామెంట్స్ చూపించింది గీతు.. దానితో రతికకి దిమ్మ తిరిగిపోయింది. అవునా జనాలకు నేను అలా అర్థమైతే అది నా ఖర్మ, నేనేమి చేయలేను అంటూ చెప్పింది.

Rathika and Geetu Interview Highlights:

Rathika Rose Out From Bigg Boss 7
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs