బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగు పెట్టిందే 14 మంది. నాలుగు వారాల్లో నాలుగు కంటెస్టెంట్స్ వెళ్లిపోయారు. అంటే హౌస్ లో ప్రస్తుతం పదిమందే ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి గ్లామర్ వెళ్ళిపోయింది. హౌస్ లో పని చేయకుండా గొడవలతో హైలెట్ అయ్యే రతిక ఈ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోయింది. హౌస్ లో గ్లామర్ చూపించడం, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ ని తలుచుకోవడం తప్ప రతిక చేసింది ఏమి లేదు. అతి ఎక్కువ-పని తక్కువ అన్న చందాన రతిక హౌస్ లో కనిపించింది.
ఎక్కువగా హౌస్ లో రచ్చ చేస్తూ గొడవలు పడుతుంటే రతికని ఈ వారం బుల్లితెర ప్రేక్షకులు ఇంటికి పంపించేశారు. ఇక ఈ వారంతో నాలుగు లేడీ కంటెస్టెంట్స్ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటి కిరణ్ రావు, షకీల, దామిని ఇలా వరసగా లేడీ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నాలుగో వారంలోను మరో లేడీ కంటెస్టెంట్ రతిక ఎలిమినేట్ అవడంతో హౌస్ లో నుంచి గ్లామర్ వెళ్ళిపోయింది.
అయితే రతిక ఎలిమినేషన్ పై నెటిజెన్స్ నుంచి పలు అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. రతిక బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడమే కరెక్ట్, ఆ అమ్మాయి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడు, గొడవ పడితే ఫుటేజ్ వస్తుంది అని ఆమె ఫిక్స్ అయ్యి గొడవలు పెట్టుకుంది ఆమె హౌస్ కి కరెక్ట్ కాదని అందుకే ఆమె ఎలిమినేట్ అవ్వడమే కరెక్ట్ అంటూ మాట్లాడుకుంటున్నారు.