Advertisement

మళ్లీ హైపర్ ఆది చేతికి మైక్.. ఇక అంతే!


హైపర్ ఆది చేతికి మైక్ ఇస్తే.. ఎలా వాయించేస్తాడో అనేది ఇటీవల మెగాస్టార్ మూవీ ఈవెంట్‌ చూసిన ఎవరికైనా తెలిసిపోతుంది. అయితే ఎప్పుడూ మెగా ఫ్యామిలీ భజన చేసే హైపర్ ఆది.. ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరినీ కవర్ చేస్తూ ఓ స్పీచ్ ఇచ్చాడు. తాజాగా ఆయన రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యాడు. ఈ వేడుకలో హైపర్ ఆది మాట్లాడుతూ..  

Advertisement

తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న ప్రతి ఒక్కరికీ, ఇటీవల నేషనల్‌ అవార్డ్స్‌ అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. తెలుగు సినిమా రంగాన్ని తక్కువ చేసే ప్రతి ఒక్కరూ.. సినిమా పురోగతిని చూసి అనవసరమైన మాటలు మానుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మా సినిమా అందరికీ మంచే నేర్పింది. కానీ చెడు నేర్పదు. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదగిన పెద్ద ఎన్టీఆర్‌ను చూసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నేర్చుకోండి.. విజయం ఎంత ముఖ్యమో, వినయం అంతే ముఖ్యమని 90 ఏళ్ల జీవితం, 75 ఏళ్ల నట జీవితం ఉన్న ఏయన్నార్‌ను చూసి నేర్చుకోండి. అల్లూరి సీతారామరాజు లాంటి చిత్రాలు తీసి ఈ రోజుల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన, నిర్మాతకు నష్టం వస్తే డబ్బులు తిరిగిచ్చే మంచి మనసున్న కృష్ణగారిని, ఇంటికి వచ్చింది శత్రువు అయినా అన్నం పెట్టి మాట్లాడాలనే సంస్కారం ఉన్న కృష్ణంరాజుగారి నుంచి ఎంతో నేర్చుకోవాలి. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలని చూపించి, ఎవరికైనా పెట్టే స్థితిలో ఉండాలి కానీ నెట్టే స్థితిలో ఉండకూడదని చెప్పి, బతికినంతకాలం రాజులా బతికిన శోభన్‌బాబుగారి నుంచి నేర్చుకోవాలి. 

తెలుగు సినిమాలో ఏదైనా పాత్ర దక్కితే చాలనుకుని వచ్చి.. తెలుగు సినిమానే శాసించే స్థాయికి చేరిన మెగాస్టార్‌ చిరంజీవిగారిని చూసి.. హార్డ్‌వర్క్‌ ఎప్పుడు ఫెయిల్‌ కాదని నేర్చుకోండి. ఆయన తల్లికి క్యాన్సర్‌ వచ్చి మరణిస్తే అలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదని బసవతారకం ఆస్పత్రిని పెట్టిన బాలకృష్ణగారిని చూసి బాగా బతకడం అంటే మనం మాత్రమే కాదు.. పక్కన వాళ్లను కూడా బతికించాలని నేర్చుకోవాలి. ఆరు పదుల వయసులో కూడా ఆరోగ్యం ఉంటే అన్ని బావుంటాయని నమ్ముతూ నవ మన్మధుడిలా కనిపించే నాగార్జునగారిని, నాన్న గొప్పొడు నేను కాదు.. అని గ్రహించి ముందుకెళ్లే విక్టరీ వెంకటేశ్‌గారు‌, తనకు జీవితం ఇచ్చిన గురువు దాసరి నారాయణరావుగారిని దైవంగా భావించే మోహన్‌బాబుగారిని చూసి గురు భక్తిని నేర్చుకోండి. 

10 మంది పేదల్ని ఓ పక్క, వంద కోట్ల డబ్బు ఓ పక్క పెట్టి ఏది కావాలో కోరుకో అంటే.. ఈ వంద కోట్లను ఆ పదిమందికి పంచి ఆకలి తీరుస్తా... వాళ్ల ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అని భావించే పవన్‌ కల్యాణ్‌గారిని చూసి నేర్చుకోండి సంపాదించడమే కాదు.. సహాయం చేయడం కూడా ముఖ్యమని. ఎంతోమంది చిన్నారుల గుండెల్ని కాపాడుతున్న మహేశ్‌బాబు గారినిని చూసి చాలా నేర్చుకోవచ్చు. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రానా, గోపీచంద్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, రామ్‌ ఇలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మా సినిమా వాళ్ల నుంచి ఇంత ఉంది నేర్చుకోవడానికి. అందుకే సినిమా వాళ్లను కించపరచవద్దని హైపర్ ఆది తనదైన స్టైల్‌లో స్పీచ్ దంచేశాడు.

Hyper Aadi Speech on Telugu Cinema Industry Heroes:

Hyper Aadi Praises on Telugu Heroes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement