Advertisement
Google Ads BL

సంక్రాంతి రేసులోకి రజనీ.. ట్విస్ట్ అదిరింది


2024 సంక్రాంతి‌కి ఈసారి బీభత్సమైన ఫైట్ జరగబోతోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి దాదాపు ఓ అరడజను సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా.. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ రేసులోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి సంక్రాంతి రేసులో ఉన్న రెండు మూడు సినిమాలు మినహా విడుదల తేదీలు ఖరారు కాలేదు కానీ.. సంక్రాంతికి పక్కా అన్నట్లుగా వాళ్ల కదలికలు కనబడుతున్నాయి. 

Advertisement
CJ Advs

సంక్రాంతి బరిలో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించగా.. అంతకు ముందే తేజ సజ్జా హను-మాన్ సంక్రాంతికి అని వాయిదా వేసుకున్నారు. ఇక అంతా ఎదురు చూస్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతికి తీసుకురావాలనే విధంగా టీమ్ వర్క్ చేస్తోంది. కింగ్ నాగార్జున సడెన్‌గా ఈ రేసులోకి ఎంట్రీ ఇచ్చి నా సామిరంగా అని అనిపించారు. దిల్ రాజు సంక్రాంతి సెంటిమెంట్‌ని అస్సలు వదులుకోడు కాబట్టి.. విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా పక్కాగా ఫిక్స్ అయిపోవచ్చు. ఇలా టాలీవుడ్ నుంచే ఓ ఐదారు సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా.. ఇప్పుడు లాల్ సలామ్ అంటూ రజనీ దిగేందుకు సిద్ధమవుతున్నాడు.

లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ లాల్ సలామ్. జైలర్ బ్లాక్‌బస్టర్ తర్వాత రజనీకాంత్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ కీలక పాత్రను చేస్తున్నారు. రజనీ కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ముంబై డాన్ మెయిద్దీన్ భాయ్‌గా రజనీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అంటూ మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. రిలీజ్ డేట్‌ని అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ.. సంక్రాంతికి అని మాత్రం తేల్చేశారు. ఈ ట్విస్ట్‌తో సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలు పునరాలోచనలో పడే అవకాశం అయితే లేకపోలేదు.

Super Star Rajinikanth In Sankranthi 2024 Race:

Super Star Rajinikanth LAL SALAAM in Pongal Race
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs