యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషనే సూపర్ హిట్. ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న దేవరపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అంతకుముందు కొరటాల శివ చేసిన ఆచార్య మూవీ ఫ్లాప్ అవడంతో దేవర చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు. ప్రతి సీన్‌ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుత షెడ్యూల్‌లో భాగంగా ఈ చిత్రంలో ఒక కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం సముద్రంలోనే ఉంటుందని టాక్. దీనికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ సారధ్యం వహిస్తున్నారట. ఈ సినిమాలో ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్ దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి భారీ పోటీ ఏర్పడిందట. చివరకు నెట్‌ఫ్లిక్స్ రూ.90 కోట్లకి దక్కించుకుందని సమాచారం. నిజానికి ఇది చాలా పెద్ద విషయం.
ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ కూడా అంతకు మించి ఉండాలని చాలా ఛాలెంజింగ్‌గా ఈ సినిమా చేస్తున్నాడని సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా కానీ హిట్ అయ్యిందో.. ఎన్టీఆర్ ఖాతాలో వరుస హిట్స్ సంఖ్య 7కు చేరుకుంటుంది. నిజానికి ఇటీవలి కాలంలో అయితే ఇలా వరుసగా ఏడు హిట్స్ అనేవి ఏ హీరో ఖాతాలో పడలేదనే చెప్పాలి. దీంతో ఎన్టీఆర్ ఖాతాలో దేవర హిట్ అయితే మాత్రం సరికొత్త రికార్డ్ పడినట్టే. కొరటాలకు కూడా ఈ సినిమా మంచి బూస్ట్ అవుతుంది. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది.