Advertisement
Google Ads BL

శ్రీలీల క్రేజ్‌ని వాడుకోలేకపోయారు


ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్‌కి లక్కీ గర్ల్‌గా మారింది. ఏ హీరో చూసినా శ్రీలీల నామ జపమే. ఆమె లక్కీనే కాదు.. ఆమె పెరఫార్మెన్స్, లుక్స్, ఎనర్జి లెవెల్స్ అన్ని ఆమెకి అదనపు ఆకర్షణలు. ఇక డాన్స్ విషయమైతే చెప్పక్కర్లేదు. స్క్రీన్ మీదే కాదు బయట ఏ ఈవెంట్‌లో అయినా అందరి చూపు శ్రీలీల పైనే.. అనేలా ఆమె లుక్స్, అవుట్ ఫిట్స్ ఉంటాయి. 

Advertisement
CJ Advs

అంత క్రేజ్ ఉన్న శ్రీలీలని స్కంద టీం సరిగ్గా వాడుకోలేకపోయిందా.. అసలు బోయపాటి సోలో ఇంటర్వూస్ ఇవ్వరు, కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తప్ప. అలాగే రామ్ శ్రీలీల‌తో ఇంటర్వ్యూలో కనిపించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్ళాడు. అక్కడ శ్రీలీల మిస్ అయ్యింది. అక్కడ శ్రీలీల ఉంటే యూత్ నుంచి విజిల్స్ పడేవి. స్కంద ఈవెంట్‌లో రామ్‌తో శ్రీలీల కాలు కదిపితే ఆ క్రేజ్ వేరు. 

 

ఇక శ్రీలీల డైరెక్ట్‌గా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఆమె ఏదో సోలో ఇంటర్వ్యూ ఇప్పించి అది పీఆర్వోస్ ద్వారా పబ్లిసిటీ చేయించారు తప్ప... శ్రీలీల డైరెక్ట్‌గా మీడియాకి కనబడలేదు. అటు రామ్ కూడా నేరుగా మీడియా ముందు ఓ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పబ్లిక్ లో కనిపించాడు. కానీ శ్రీలీల మీడియా ముందు హడావిడి చేసుంటే స్కంద‌కి ఎంతో కొంత హెల్ప్ అయ్యేది. కానీ శ్రీలల క్రేజుని అస్సలు స్కంద మేకర్స్ వాడుకోలేకపోయారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Skanda Missed Sreeleela Craze:

Sreeleela Skanda Movie Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs