ఎట్టకేలకి ఐదు నెలలకి అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఈ శుక్రవారం ఓటిటి లోకి వస్తుంది అనుకుంటే ఇప్పుడు అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఇంతకుముందు అనిల్ సుంకర నిర్మించిన భోళా శంకర్ విడుదల సమయంలో రచ్చ చేసిన వైజాగ్ సతీష్ మరోమారు ఏజెంట్ పై రచ్చకు తెరలేపారు.
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ చిత్రం ఓటిటి వేదిక సోనీ లివ్ ద్వారా ఈ నెల 29 న స్ట్రీమింగ్ కానుంది. అయితే వైజాగ్ కు చెందిన పంపిణీదారుడు బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయం లో అన్యాయం జరిగిందని, నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ న్యాయం కోరుతూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కు వెళ్ళారు.
ఆయన వాదనలు విన్న తర్వాత ఈ నెల 29 న ఏజెంట్ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే (యధాతధాస్థితి) ఇచ్చిందని అడ్వకేట్ కేశాపురం సుధాకర్ తెలిపారు.