Advertisement
Google Ads BL

జగన్ టార్గెట్ భువనేశ్వరి, బ్రాహ్మిణిలేనా?


ఏపీ సీఎం జగన్ మొండివాడన్న సంగతి తెలిసిందే. తనను జైలుకు పంపించడంలో టీడీపీ అధినేత కీలక పాత్ర పోషించారని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసిన వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులంటూ లేకుండా చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే చంద్రబాబును స్కిట్ డెవలప్‌మెంటు కేసులో అరెస్ట్ చేయించి జైలులో పెట్టించారు. ఇకపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14 గా నారా లోకేష్ పేరును చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. నేడో రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ లీకులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు కీలక టీడీపీ నేతలను పలు కేసుల్లో ఇరికించే పనిలో పడింది. 

Advertisement
CJ Advs

ఇది చాలదన్నట్టు తాజాగా మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. నిజానికి ఒకవేళ నారా లోకేష్‌ను అరెస్ట్ చేసినా కూడా నారా బ్రాహిణిని ముందుంచి టీడీపీని నడిపిస్తామని ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. మరి టీడీపీకి ఈ దిక్కు కూడా లేకుండా చేయాలనుకున్నారో ఏమో కానీ ఏపీ సీఎం జగన్ నెక్ట్స్ టార్గెట్ నారా భువనేశ్వరి, బ్రాహ్మిణిలేనని తెలుస్తోంది. వీరిద్దరిపై కూడా కేసులు నమోదు చేసేందుకు సీఐడీ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోందట.  దీనిలో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను చేర్చిందని టాక్. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో హెరిటేజ్ బాగా లబ్ధి పొందిందని సీఐడీ చెప్పడం వెనుక ఆంతర్యం భువనేశ్వరి, బ్రాహ్మిణిలపై కేసులు నమోదు చేయడానికేనని సమాచారం.

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు లోకేష్ డైరెక్టర్ మాత్రమే. మేనేజ్‌మెంట్ హోదాలో వచ్చేసి నారా బ్రాహ్మిణి, భువనేశ్వరి ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో నిధులను హెరిటేజ్‌కు మళ్లాయంటూ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదుకు యత్నాలు జరుగుతున్నాయట. లోకేష్ అరెస్ట్ తర్వాత నారా బ్రాహ్మిణి, భువనేశ్వరిలలో ఏ ఒక్కరైనా పార్టీకి అండగా ఉండొచ్చు. వీరు అండగా నిలిస్తే సింపతి బాగా వర్కవుట్ అవుతుంది. దీంతో తాము ఇప్పటి వరకూ పడిన ప్రయాస అంతా గంగలో పోసిన పన్నీరవుతుందని భావించిన జగన్.. ఇప్పుడు వారిద్దరి అరెస్ట్‌కు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజముందనేది తెలియడం లేదు. ఇప్పటి వరకూ చేసిందే అవివేకపు పనులు. ఇప్పుడు బ్రాహ్మిణి, భువనేశ్వరిలను సైతం అరెస్ట్ చేయిస్తే దానికంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Is Jagan target Bhuvaneshwari and Brahmani?:

Why YS Jagan Is Involving Nara Bhuvaneshwari & Brahmani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs