సెప్టెంబర్ 1న ఖుషి తో ప్రేక్షకులకి పలకరించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో VD 12, పరశురామ్ తో VD13 మూవీస్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయాడు. గీత గోవిందం తర్వాత రాబోతున్న పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబోపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. VD13 నుంచి షూటింగ్ ప్రోగ్రెస్ ను మేకర్స్ ఇవాళ వెల్లడించారు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వారు తెలిపారు. VD 13 సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఇంత స్పీడుగా విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ షూటింగ్ జరగడం రౌడీ అభిమానులకి షాకిచ్చింది.
లైగర్ డిసాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పూర్తిగా ఖుషి షూటింగ్, కథల ఎంపికలో సమయాన్ని వెచ్చించాడు అలాగే పూర్తి ఫిట్ నెస్ కోసం ఎక్కువగా జిమ్ లోనే గడిపాడు. ఇక పరశురామ్ తో సినిమా అనుకున్నది మొదలు చాలా త్వరగా సెట్స్ లోకి వెళ్లడం.. షూటింగ్ కూడా అంతే స్పీడుగా పూర్తి చెయ్యడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది.