Advertisement
Google Ads BL

ప్రభాస్ vs షారుక్: మధ్యలో ఫాన్స్ ఫైర్


సలార్ మూవీ డిసెంబర్ 22 అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడమే కాదు.. దర్శకుడు ప్రశాంత్ నీల్ వైఫ్ ఇన్స్టా స్టోరీస్ లో సలార్ డేట్ పై ఇండైరెక్ట్ గా చేసిన పోస్ట్ తో అందరూ ఆ డిసెంబర్ 22 డేట్ నే వైరల్ చేస్తున్నారు. అయితే అదే క్రిష్టమస్ కి షారుఖ్ ఖాన్ డుంకీ విడుదల తేదీని షూటింగ్ మొదలైన రోజే ప్రకటించారు. ఈ ఏడాది షారుఖ్ పఠాన్, జవాన్ హిట్స్ తో ఫుల్ క్రేజీగా ఉన్నారు. 

Advertisement
CJ Advs

అటు ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్. బాహుబలి, సాహో తో కోట్లు కొల్లగొట్టాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అయినా.. ప్రభాస్ సలార్ పై భీభత్సమైన అంచనాలున్నాయి. KGF తో ప్యాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ అక్కడ, అందుకే సలార్ పై ఇంత హైప్. ఇప్పుడు షారుఖ్-ప్రభాస్ మధ్యలో క్లాష్ వస్తే అది బాక్సాఫీసు దగ్గర చూడడానికి క్రేజీగానే ఉన్నా అటు ఓపెనింగ్స్ విషయంలో నార్త్ లో ప్రభాస్ కి, ఇటు షారుఖ్ కి సౌత్ లో దెబ్బపడిపోతుంది. 

అలాగే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ప్రభాస్, షారుఖ్ అభిమానులు సోషల్ మీడియాలో కొట్లాటకు దిగడం ఖాయం. పఠాన్, జవాన్ లాంటి రొటీన్ కథల్తోనే కోట్లు కుమ్మరించిన షారుఖ్, రాజ్ కుమార్ హిరానీతో సినిమా అంటే ఆ క్రేజే వేరు. దాని ముందు ప్రభాస్ ప్యాన్ ఇండియా క్రేజ్ ఎంతవరకు నిలబడుతుంది. ఇటు సౌత్ లో ప్రశాంత్ నీల్ KGF క్రేజ్, అటు ప్రభాస్ క్రేజ్ కలిపితే ఇక్కడ షారుఖ్ నిలబడడం కష్టం. 

మరి ఈ ఇద్దరి స్టార్స్ లో ఎవరో ఒకరు తగ్గితే ఓకె.. అసలు హోంబ్లే ఫిలిమ్స్ వారు ఈ డేట్ ని లీక్ చేసి బయట ఈ డేట్ పై ఎలాంటి హైప్ ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేశారేమో అనే డౌట్ కూడా షారుఖ్ అభిమానుల నుంచి వినిపిస్తుంది. 

Prabhas vs Shah Rukh Khan:

Shah Rukh Khan Dunki Vs Prabhas Salaar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs