బాలకృష్ణ తన బావగారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉండడంతో అక్క భువనేశ్వరికి సపోర్ట్ గా ఒక వారం పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. అటు ఏపి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ పై గందరగోళం చేసిన బాలక్రిష్ణని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు. అయితే రాజకీయాల్తో బిజీగా కనిపించడంతో ఆయన నటిస్తున్న భగవంత్ కేసరిపై ఎమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో.. రిలీజ్ డేట్ మారిపోతుందేమో అని నందమూరి అభిమానులు టెన్షన్ పడ్డారు.
ఎందుకంటే భగవంత్ కేసరి చిన్నపాటి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండడంతో బాలయ్య అందుబాటులో లేరు అని అందరూ అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి బాలయ్యని కలిసి పరిస్థితి వివరించి ఆయన డేట్స్ తీసుకుని రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య అలాగే ఇతరులపై ఆ షెడ్యూల్ ని చక చకా కంప్లీట్ చేసేసారు. బాలయ్య కోపరేట్ చెయ్యడంతో భగవంత్ కేసరి షూటింగ్ నిన్న సోమవారంతో దిగ్విజయంగా పూర్తయ్యింది.
అనిల్ రావిపూడి కూల్ గా పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోతున్నాడు. సినిమా విడుదలకు 20 రోజులు సమయమే ఉండడంతో ఇకపై ప్రమోషన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. బాలయ్య టీం ఇంటర్వ్యూ ఒకరోజు, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒకరోజు ప్రమోషన్స్ అంటూ ప్లాన్ చేసుకుంటున్నారు. మిగతాది మొత్తం అనిల్ రావిపూడి చిత్ర బృందం చూసుకుంటారట. ఇప్పటికే డబ్బింగ్ వగైరా పూర్తి కావడంతో భగవంత్ కేసరి అనుకున్న సమయానికి విడుదలకు రెడీ అవుతుంది అనే న్యూస్ చూసాక అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.