Advertisement
Google Ads BL

బిగ్ బాస్ బజ్ లో బిక్క మొహం వేసిన దామిని


బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన సింగర్ దామిని అంత వీక్ కంటెస్టెంట్ అయితే కాదు. సుబ్బు, తేజ లాంటి వాళ్ళ మీద బెటర్. కానీ ఆమె యావర్ ప్రిన్స్ పై చేసిన అతి వలనే ఈ వారం ఎలిమినేట్ అవడం జరిగింది. యావర్ పై టాస్క్ విషయంలో పేడ నీళ్లు వెయ్యడం ఇలా చాలా ఎక్కువ చేసింది. ఇక నిన్న ఆదివారం ఎలిమినేట్ అయిన దామిని హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతుంది అంటూ శివాజీ ఎప్పుడో చెప్పాడు. 

Advertisement
CJ Advs

బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నా బిగ్ బాస్ బజ్ లో మాత్రం దామిని గీతూ అడిగిన ప్రశ్నలకు బిక్కమొహం వేసింది. ప్రిన్స్ యావర్ పై పేడ నీళ్లు కొట్టి ఊపిరి ఆడకుండా చేయడమే గేమా అని గీతూ అడిగింది. దానికి కాస్త తడబడిన దామిని అది టాస్క్ మాత్రమే నేనేమైన సీరియల్ కిల్లర్ ని అనుకుంటున్నారా అంది. అలాగే ఇంగ్లీష్ లో మాట్లాడిన బూతులని కూడా గీతు అడిగింది. నీ దృష్టిలో బూతులు తెలుగులో మాట్లాడి బూతులు, ఇంగ్లీష్ లో మాట్లాడితే నీతులా అని అడగ్గానే తెల్లమొహం వేసింది దామిని. 

ఇక హౌస్ లో రతిక సగం సగం వింటుంది. శుభశ్రీ రెడీ అవడంపైనే దృష్టి పెడుతుంది. తేజకి వెటకారమెక్కువ, అలాగే శోభా శెట్టి కి చెంచా. గౌతమ్ కి ఏమి తెలియదు. అన్ని తనకే తెలుసు అనుకుంటాడు. యావర్ కాస్త ఇతరులని అర్ధం చేసుకోవాలి. శివాజీది కన్నింగ్ గేమ్. పల్లవి ప్రశాంత్ గురించి మట్లాడడమే వేస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. 

Bikka Moham Damini in Bigg Boss Buzz:

Damini in Bigg Boss Buzz Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs