Advertisement
Google Ads BL

దేవరకొండకి హ్యాండిచ్చిన హీరోయిన్


విజయ్ దేవరకొండ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది అనగానే ఎవరై ఉంటారబ్బా అనుకునేరు. ఇంకెవరు బిజీ హీరోయిన్ శ్రీలీలనే. ఈమధ్యన రవితేజ-గోపీచంద్ మలినేని మూవీ నుంచి కూడా ఈ పాప సడన్‌గా డ్రాప్ అయ్యింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా నుంచి కూడా తప్పుకుంది అనే వార్త మీడియాలో కనిపించగానే రౌడీ ఫాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం బిజీ షెడ్యూల్స్‌ని మెయింటైన్ చేస్తున్న శ్రీలీలకి డేట్స్ ప్రోబ్లెంస్ తలెత్తి విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరితో విజయ్ చెయ్యాల్సిన VD 12 నుంచి శ్రీలీల తప్పుకోవడంతో ఇప్పుడు మరో హీరోయిన్ వేటలో టీమ్ తలమునకలై ఉందట. రామ్ స్కందని పూర్తి చేసిన శ్రీలీల ఆ తర్వాత భగవంత్ కేసరి, ఆది కేశవ చిత్రాలు కూడా ఫినిష్ చేసేసింది. 

ఇక నితిన్‌తో ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ షూటింగ్ చేస్తున్న శ్రీలీల అటు పవన్ కళ్యాణ్ ఇటు మహేష్ మూవీస్ కూడా చేతిలో ఉండడంతో డేట్స్ సెట్ కాక రవితేజ మూవీని కొద్దిరోజులు హోల్డ్ లో పెట్టడంతో ఇక వర్కౌట్ అవ్వదని తెలిసే రవితేజతో పాటుగా విజయ్ దేవరకొండ VD 12 ని వదులుకున్నట్లుగా చెబుతున్నారు. ఇవి కాకుండా ఇంకో అరడజనుకు పైగా సినిమాలలో ప్రస్తుతం శ్రీలీల నటిస్తోంది.

Tollywood Crush Dropped From VD12:

Sree Leela Says No To Ravi Teja And Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs