మెగా అభిమానులు మరో ఏడాది వరకు వేచి ఉండాల్సిందే. దేని కోసమంటే.. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కోసం. శంకర్ దర్శకత్వంలో మూడు లాంగ్వేజెస్‌లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ డేట్ కోసం మెగాభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. శంకర్ కూడా ఓ పట్టాన సినిమా చుట్టేసే రకం కాదు అన్ని చెక్కి చెక్కి ఫైనల్ అవుట్ ఫుట్ ఇస్తారు.
అందుకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి గానీ, కమల్ హాసన్ ఇండియన్ 2 కి గానీ రిలీజ్ డేట్ ఇవ్వడం లేదు. మెగా ఫాన్స్ అరిచి గీ పెట్టినా అందుకే మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేది. అయితే వచ్చే ఏడాది చివరిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ ఉండొచ్చనే ప్రచారం, ఊహాగానాలు నడిచాయి.
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం గేమ్ చేంజర్ కోసం మరో ఏడాది అంటే 2025 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.. 2024 అక్టోబర్ లోనో, దివాళి కో ఇండియన్ 2 రిలీజ్ ఉంటుంది. ఆ తర్వాత మూడు, నాలుగు నెలల గ్యాప్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల ఉంటుందనేలా టాక్ వినిపిస్తోంది. అంటే మరో ఏడాది పాటు మెగా ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు అంటున్నారు. అయితే ఈ గ్యాప్‌లో బుచ్చిబాబు స్పీడ్ అందుకుంటే మాత్రం.. గేమ్ చేంజర్ కంటే ముందే అతని సినిమా వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.