యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ చిత్రంతో హాలీవుడ్ స్టార్స్ అంతా ఎన్టీఆర్‌ని పొగిడేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవర ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ పై భీభత్సమైన అంచనాలున్నాయి. దేవర షూటింగ్ మొదలయ్యిందో లేదో బాలీవుడ్ డెబ్యూ మూవీ అనౌన్స్‌మెంట్ ఇచ్చి అభిమానులని సర్‌ప్రైజ్ చేశాడు. వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసేశాడు.
ఎన్టీఆర్ ప్రెజెంట్ దేవర షూటింగ్‌లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో వేసిన సెట్‌లో జరుగుతోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సెంటిమెంట్ సన్నివేశాలు మనసుకి హత్తుకునే విధంగా ఉండబోతున్నాయని అంటున్నారు. సముద్ర గర్భంలో జరిగే యాక్షన్ సన్నివేశం కోసం అచ్చంగా సముద్రాన్ని తలపించే బ్లూ మ్యాట్ వేశారు. దీనికోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.
అయితే ఎన్టీఆర్ ఫాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు.. దేవర వరకే మన బాధ్యత.. ఆ తర్వాత ఇక మన అవసరం ఉండదు.. అంటే దేవర సినిమా వరకు ఎన్టీఆర్ ని తెలుగు రాష్ట్రాల్లో హైప్ లో ఉంచడం వరకే మన బాధ్యత.. తర్వాత వార్ 2 తో ఎంట్రీ ఇచ్చాక బాలీవుడ్‌యే చూసుకుంటాది.. #WAR2 💥🔥 మామూలుగా ఉండదు హవా, ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉండటమే .. Aa Next వచ్చే series లు, నీల్ మూవీ లు.. రచ్చ రచ్చే అంతా @tarak9999 💥💥 అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ గురించి ఆయనకి పెరగబోయే క్రేజ్ గురించి ఇప్పటినుంచే కలలు కనేస్తున్నారు.