Advertisement
Google Ads BL

రష్మికపై మాజీ ప్రియుడు కామెంట్స్


రష్మిక కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే తన మొదటి సినిమా హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించేసి నిశ్చితార్ధం వరకు వెళ్ళిపోయింది. అయితే ఎంగేజ్మెంట్‌కి, పెళ్ళికి గ్యాప్ రావడంతో కెరీర్‌పై ప్రేమతో తన ప్రేమని బ్రేకప్ చేసుకుని కెరీర్‌లో దూసుకుపోతుంది. కెరీర్ కోసం ప్రేమని పక్కనబెట్టిన రష్మిక తెలుగు, తమిళ, హిందీ అంటూ టాప్ రేంజ్‌కి చేరిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగిపోయింది. 

Advertisement
CJ Advs

అయితే రష్మిక కాంతార మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ అయ్యాక.. దర్శకుడు రిషబ్ శెట్టి అలాగే కిర్రిక్ పార్టీ సినిమా ప్రొడక్షన్ హౌస్, హీరో‌తో ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో రిషబ్ శెట్టి‌కి రష్మికకి కోల్డ్ వార్ జరిగింది. అయితే తాజాగా రష్మిక బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగరాలు దాటి మూవీని తెలుగులో రిలీజ్ చేశాడు. ఆ చిత్రం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. 

అయితే రిషబ్ శెట్టి విషయంలో రష్మికని కన్నడ ప్రేక్షకులు బాగా ట్రోల్ చేశారు. ఇక రక్షిత్ శెట్టి తాజాగా రష్మిక తాను మాట్లాడుకుంటామంటూ షాకిచ్చాడు. రిషబ్ సంగతి నాకు తెలియదు కానీ.. నేను, రష్మిక మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం.

నా సినిమా రిలీజైతే తను విష్ చేస్తుంది. తన సినిమా ఏదైనా విడుదలైతే నేను విష్ చేస్తా. కెరీర్ విషయంలో రష్మిక చాలా కలలు కంది. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అంటూ రష్మికపై రక్షిత్ శెట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Rakshit Shetty Shocking Comments about Rashmika :

Rakshit Shetty about His Ex Lover Rashmika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs