బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారానికి గాను వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఎప్పటిలాగే నాగార్జున వచ్చేసారు. ఈ శనివారం హౌస్ మేట్స్ లో కొంతమందిని నాగార్జున వరసగా వాయించేసారు. ముఖ్యంగా కంటెండర్లుగా నిలిచిన ప్రియాంక, శోభా శెట్టి లని ప్రిన్స్ యావర్ విషయంలో నిలదీశారు. అమరదీప్ నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావు. ప్రియాంక కోసం ఆడడానికి వచ్చావా అంటూ నాగ్ ఇచ్చిపడేసారు.
శోభా శెట్టి నువ్వు ప్రిన్స్ ని స్ట్రాంగ్ అన్నావ్ అంటే నువ్ వీకే కదా.. అంటూ శోభా కి క్లాస్ ఇచ్చారు. సంచాలక్ గా సందీప్ మాస్టర్ నువ్ ఫెయిల్ అయ్యావు. అసలు సంచాలక్ గా నువ్ గేమ్ ఆడావు. నువ్వు సంచాలక్ అయినా గేమ్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు. నువ్వు పర్సనల్ గా ఆడావా.. శోభా శెట్టి ప్రిన్స్ ని స్ట్రాంగ్ అన్నప్పుడు నువ్ శోభని ఎలిమినేట్ చెయ్యాలి. కానీ వీక్ గా ఉన్న శోభని ముందుకు పంపించావు. అసలు నిన్ను నువ్వు తోపు అనుకుంటున్నావా..
సంచాలక్ గా సందీప్ ఫెయిల్ అని ఎంతమంది చెయ్యి ఎత్తుతారు అనగానే కొంతమంది చెయ్యి ఎత్తారు. దానితో సందీప్ బాటరీ ఛార్జ్ దిగిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున సందీప్ ని ఎడాపెడా వాయించేసాడు. ఇప్పటివరకు సందీప్ ఫెయిర్ గా ఆడాడు అన్నారు.. కానీ ఇప్పుడు అతనిపై ప్రేక్షకుల్లోకి నెగిటివిటీ వెళ్లడం ఖాయం.