ఏపీ సీఎం జగన్ ఎంత మొడివాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఇది నిరూపణ అయ్యింది. తాను అనుకున్నది జరిపించుకునేందుకు ఎంత దూరమైన వెళతారనడంలో సందేహం లేదు. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ 23తో జగన్‌కు చాలా అనుబంధం ఉంది. 16 నెలల జైలు జీవితం అనంతరం ఇదే రోజున జగన్ బయటకు వచ్చారు. ఇక ఈ ఏడాది ఇదే రోజున టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ ఎంతటి కక్షపూరిత రాజకీయాలు చేస్తారనేది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. 73 ఏళ్ల వయసులో చంద్రబాబును అకారణంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని ప్రస్తుతం ఏపీలో బీభత్సంగా చర్చ నడుస్తోంది.
ఇప్పటికే తను 16 నెలల పాటు జైలులో ఉన్నాను కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబును 16 రోజుల పాటైన జైలులో ఉంచాలని వైఎస్ జగన్ డిసైడ్ అయ్యారని.. దానిలో భాగంగానే ఆయనను జైలుకు పంపారని టాక్ నడుస్తోంది. తాజాగా నడుస్తోన్న మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తాను ఏ రోజైతే జైలు నుంచి జగన్ బయటకు వచ్చారో అదే రోజున చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించేలా ప్లాన్ చేశారట. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌ను 2012, మే 27న సీబీఐ అరెస్ట్ చేసింది. 15 నెలల 27 రోజుల పాటు అంటే మూడు రోజుల తక్కువ ఆయన 16 నెలల పాటు జగన్ హైదరాబాద్‌లోని చంచలగూడ జైల్లో ఉన్నారు. 16 నెలలకు ఆయనకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2013, సెప్టెంబర్ 23న బెయిల్ మంజూరు చేసింది.
ఆ మరుసటి రోజు అంటే 2013, సెప్టెంబర్ 24న జగన్ బెయిల్‌పై బయటికొచ్చారు. సరిగ్గా పదేళ్ల తర్వాత ఇదే సమయానికి చంద్రబాబు సీఐడీ కస్టడీని ఎదుర్కొంటున్నారు. నిజానికి ఇది కాలమహిమ అనుకోవాలో లేదంటే జగన్ మహిమ అనుకోవాలో జనాలకు బాగా తెలుసు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ ఈ నెల 9న నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్‌ను నిన్న మరో రెండు రోజుల పాటు ఏసీబీ కోర్టు పొడిగించి సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అప్పట్లో జగన్‌కు బెయిల్ మంజూరు అయిన రోజు.. విడుదలైన రోజు రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు చంద్రబాబు విచారించనున్నారు.