అల్లు అర్జున్ నిన్న ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. అదేమిటి పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది అల్లు అర్జున్ సింగిల్ గా ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటే.. అల్లు అర్జున్ ముంబై లో దర్శకుడు అట్లీని కలిసేందుకు వెళ్ళాడు అని తెలియగానే అల్లు ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ని నిజం చేస్తూ అల్లు అర్జున్ అట్లీని కలిసి ముంబై లో చర్చలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది.
అట్లీ కూడా ఓ లైన్ అనుకున్నాను, ఇంతకుముందే అల్లు అర్జున్ ని కలిసాను. ఆయన ఆ లైన్ కి ఇంప్రెస్ అయ్యాడు. దేవుడు దయ తలిస్తే ఈప్రాజెక్టు ఉంటుంది అంటూ ఈమధ్యనే అల్లు అర్జున్ మూవీపై స్పందించాడు. ఇంతలోపులోనే అల్లు అర్జున్ వెళ్లి అట్లీని మీటవడం చూసి అందరిలో ఒకటే ఆశ్చర్యం. అల్లు అర్జున్ స్పీడుకి. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప 2 షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2024 న రిలీజ్ చేస్తున్నాడు.
అలాగే ఈ చిత్రం తర్వాత ముందుగా సందీప్ వంగాతో ప్రాజెక్ట్ కమిటయ్యాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఇప్పుడు కొత్తగా అట్లీతో జట్టు కట్టేందుకు సిద్దమవడమే కాదు.. కథ చర్చల కోసం ముంబై వెళ్లడమే హాట్ టాపిక్ అయ్యింది. అట్లీతో అల్లు అర్జున్ మీటింగ్ గత రాత్రి జరగగా.. ఈరోజు శనివారం అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చేసాడు.