Advertisement
Google Ads BL

బాబీ సింహకి స్నేహితుల నుంచి బెదిరింపులు


రీసెంట్ గా కోలీవుడ్ నటుడు బాబీ సింహపై ఆయన స్నేహతులు కేసు పెట్టిన విషయం హాట్ టాపిక్ అయ్యింది. బాబీ సింహపై కేసు పెట్టిన అతని స్నేహితులే ఇప్పుడు బాబీ సింహాని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా బాబీ సింహ సంచలన కామెంట్స్ చేసాడు. అసలు స్నేహితులకి బాబీ కి మద్యన ఏం జరిగింది అంటే.. బాబీ సింహ కొడైకెనాల్ లో ఓ ఇంటి నిర్మాణం కోసం అతని స్నేహితులకి తెలిసిన కాంట్రాక్టర్లుకి ముందస్తుగా కోటిన్నర ఇచ్చి ఇంటి నిర్మాణ కాంట్రాక్టు అప్పజెప్పాడట.

Advertisement
CJ Advs

కానీ వాళ్ళు నిర్మాణాన్ని నాసిరకంగా కట్టడమే కాకుండా, ఆ కాంట్రాక్టర్ కి తమిళనాడు పొలిటికల్ నేపథ్యం ఉన్న వ్యక్తి కావడంతో.. ఆ కోటిన్నర కాకుండా అదనంగా మరో 40 లక్షలు డిమాండ్ చేశారట. కానీ ఇంటి నిర్యాణం పూర్తి చేయలేదట. దానితో బాబీ సింహ వాళ్ళు కొడైకెనాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారట. అయితే సదరు వ్యక్తికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండడంతో పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడంతో బాబీ సింహ వాళ్ళు కోర్టుకెళ్లారట.

కానీ వాళ్ళు రాజకీయ అండతో బాబీ సింహానే తమని బెదిరించాడని కేస్ పెట్టారట. బాబీ సింహ కోర్టుకి వెళ్ళడంతో.. కోర్టు జోక్యంతో బాబీ సింహాని బెదిరించిన ఫ్రెండ్స్ పై పోలీస్ లు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాము కోటిన్నర నష్టపోయామని, వాళ్ళు తమ ఇంటి నిర్మాణానికి కేవలం 50 లక్షలు ఖర్చు పెట్టి నాసిరకంగా ఇల్లు నిర్మించినట్టుగా బాబీ సింహ చెబుతున్నాడు. ఇప్పడు ఆ విషయంలో అతని స్నేహితులు బాబీని చంపేస్తామని బెదిరిస్తున్నట్టుగా బాబీ సింహ చెప్పడం గమనార్హం. 

Friends Who Threatened To Kill Bobby Simha:

Death Threats to Actor Bobby Simha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs