Advertisement
Google Ads BL

పెళ్లి రూమర్స్ పై సాయి పల్లవి సీరియస్


ఈమధ్యన సినిమాలు తగ్గించేసింది.. తెలుగు, తమిళ్ లో కనిపించడం లేదు.. అంటే సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుంది అనే రూమర్ కన్నా ఈమధ్యన ఓ దర్శకుడితో కలిసి సాయి పల్లవి దండలు వేసుకున్న ఫోటోని వైరల్ చేస్తూ సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయేది ఈ దర్శకుడిని అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే కొద్ధి రోజులు సినిమాలకి దూరంగా ఉన్న సాయి పల్లవి అటు తమిళ, ఇటు తెలుగు సినిమాలతో మళ్ళీ బిజీగా మారిపోయింది. 

Advertisement
CJ Advs

సందట్లో సడేమియాలా సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుంది కాదు, అసలు ఆ దర్శకుడితో పెళ్లెప్పుడో అయ్యిపోయింది అంటూ సాయి పల్లవి-ఆ దర్శకుడు దండలు వేసుకుని ఉన్న ఫోటోని కట్ చేసి వైరల్ చేసారు. దానితో సాయి పల్లవి ఈ పెళ్లి వార్తలపై సీరియస్ అయ్యింది. తాజాగా ఆమె తాను ఓ తమిళ సినిమా ఓపెనింగ్ లో పాల్గొన పిక్స్ ని షేర్ చేస్తూ.. నేను సాధారణంగా ఇలాంటి రూమర్స్ పట్టించుకోను. కానీ అందులో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉంటే మాట్లాడాలి. నేను చేయబోయే ఒక సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోని కావాలని కట్ చేసి ఉద్దేశపూర్వకంగా డబ్బులిచ్చి మరీ ప్రమోట్ చేశారు. 

నేను నా వర్క్ గురించి మంచి ప్రకటనలు పంచుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి రూమర్స్ కి వివరణలు ఇచ్చుకోవాల్సి రావడం చాలా నిరుత్సాహపరుస్తుంది నన్ను. కావాలని కొంతమంది పనిగట్టుకుని ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది.. దానితో ఆమె పెళ్లి వార్తలు కేవలం రూమర్స్ అనేది తేలిపోయింది. 

Sai Pallavi trashes marriage rumors:

Pretty Beauty Sai Pallavi Phoophoos marriage rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs