బిగ్ బాస్ సీజన్ 7 లో గ్లామర్ గర్ల్ గా కాలుపెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేస్తూ హైలెట్ అవ్వాలని తెగ ట్రై చేస్తుంది. ఏడుపు, గొడవ, ప్రిన్స్ తో లవ్ ట్రాక్ ఇవన్నీ రతిక హౌస్ లో రకరకాలుగా ఫుటేజ్ ఇచ్చేందుకు తెగ కష్టపడుతుంది. అయితే రతిక అప్పుడప్పుడు హౌస్ లో ఒంటరిగా కూర్చుని తన పాత బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ తెగ ఎక్సట్రాలు చేస్తుంది. ఇంతకీ ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు రాహుల్ సిప్లిగంజ్. వీరిది ఆరేళ్లకు ముందు స్నేహం, తరవాత ప్రేమ. కానీ బ్రేకప్ య్యింది. అది ఇప్పుడు రతిక హౌస్ లో గుర్తు చేసుకోవడం అంటే సింపతీ కోసమేగా.. అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు సడన్ గా రతిక-రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంలో రాహుల్ ఇన్స్టా వేదికగా ఇండైరెక్ట్ గా ప్రస్తావించాడు. రాహుల్ సిప్లీగంజ్ ఇండైరెక్ట్ గా స్టోరీ పెట్టాడు. ఫేక్ సింపతి గేమ్ ఎప్పటివరకు సాగుతుంది. ఎవ్వరైనా తమ సొంత టాలెంట్‍ను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది ఎప్పుడూ ఇతరుల టాలెంట్, వారికొచ్చిన పేరుపై ఆధారపడుతుంటారు. అదే విషయాన్ని కొంతమంది నిరూపిస్తారు అన్నాడు.
అంతేకాకుండా ఫేమ్ కోసం వేరే వాళ్ల కష్టాన్ని అవసరానికి కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. నీ లోపల ఉన్న మరో మనిషికి ఆల్ ది బెస్ట్. నీ దగ్గర డబ్బులు తీసుకుని పబ్లిసిటీ చేస్తున్న వారికి కూడా కంగ్రాట్స్ అని చెప్పుకొచ్చాడు. అంటే రతిక కావాలనే పిఆర్ టీమ్ తో తనపై నెగిటివిటి వచ్చేలా చేస్తుంది అని రాహుల్ ఇలా చెప్పకనే చెబుతున్నాడు.
అలాగే మరో స్టోరీలో నాకు ఒక ప్రశ్న ఉంది.. ఆరేళ్ల తర్వాత ఒకరి ఫోన్‌లో ఉన్న పర్సనల్ ఫొటోలు ఒక్కసారిగా ఎలా బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. అంటే ఇది వాళ్లు (బిగ్ బాస్ హౌస్ లోకి) వెళ్లే ముందే ప్రీ ప్లాన్‌గా చేసిన పనే అని అర్ధమైపోతుంది.. అంటూ రాహుల్ ఇండైరెక్ట్ గానే అయినా గట్టిగానే ఫైర్ అయ్యాడు.