హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేసి.. పూజ కార్యక్రమాలతో సెట్స్ మీదకెళ్ళేసరికి టైటిల్ మార్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ గా షూటింగ్ మొదలు పెట్టి చకచకా మొదటి షెడ్యూల్ పూర్తి చెయ్యడమే కాదు.. అందులోనుంచి UBS గ్లిమ్ప్స్ ని వదిలి అభిమానులని కూల్ చేసాడు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కోసం దాదాపుగా ఆరు నెలల పాటు వెయిట్ చేసాడు. ఈమధ్యనే పొలిటికల్ డేట్స్ తో పాటుగా ఉస్తాద్ కి డేట్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ పవన్ డేట్స్ ఇవ్వడమే తరువాయి.. మళ్ళీ స్పీడుగా షూటింగ్ చిత్రీకరణ మొదలు పెట్టేసాడు.
మళ్ళీ పవన్ కళ్యాణ్ కొద్దిపాటి బ్రేక్ తో ఈ నెల 26 నుంచి హరీష్ శంకర్ కి మళ్లీ డేట్ లు ఇవ్వడంతో ఇక రెచ్చిపో హరీష్ శంకర్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. ఇంకొంతమంది హరీష్ శంకర్ పవన్ తో చేస్తున్న తేరి రీమేక్ గురించి వదలడం లేదు. దానితో హరీష్ శంకర్ కూడా ఆ ట్రోల్స్ కి పర్ఫెక్ట్ గా సమాధానమిస్తున్నారు.
హరీష్ పవన్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వడం గ్యారెంటీ.. మీరు మధ్యలో అతన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అంటూ నెటిజెన్స్ ఫాన్స్ కి చెబుతున్నారు. అయినా వారు ఆగుతారా.. ఏదో ఒక విషయంలో హరీష్ శంకర్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.