Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 7: ఏంటి బాసు ఈ రచ్చ


బిగ్ బాస్ సీజన్ 7 లోకి వచ్చిన కంటెస్టెంట్స్ చాలా తెలివైన వారు. ఎలా ఉంటే, ఎలా బిహేవ్ చేస్తే ఫుటేజ్ వస్తుందో.. ఎక్కడ గొడవ చెయ్యాలో, ఎక్కడ హైలెట్ అవ్వాలో బాగా తలకి ఎక్కించుకుని హౌస్ లోకి వచ్చారనిపిస్తుంది. నామినేషన్ వేస్తె వాళ్లపై తిరగబడి అరవడం వంటివి బాగా ఫాలో అవుతున్నారు. గత వారం ఇలానే శోభా శెట్టిని శివాజీ నామినేట్ చేసాడని.. ఆమె శివాజీపై రెచ్చిపోయింది. ప్రోపర్ రీజన్ లేకుండా నామినేట్ చేసారు మీరేంటి అని మాట్లాడింది. 

Advertisement
CJ Advs

ఇక ఈ వారం మూడో పవర్ అస్త్ర కోసం అమరదీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ని బిగ్ బాస్ సెలెక్ట్ చెయ్యగా.. వీరి ముగ్గురిలో ఎవరు అనర్హులో చెప్పమంటే గౌతమ్ శోభా శెట్టి పేరు చెప్పి ఆమె ఈ టాస్క్ కి అనర్హురాలని చెప్పాడు. ఆ సీక్రెట్ ని బిగ్ బాస్ రివీల్ చెయ్యగానే శోభ శెట్టి రెచ్చిపోయి గౌతమ్ ని నానా తిట్లు తిట్టింది. భక్ వాస్ రీజన్స్ చెప్పొద్దు.. నేను అరుస్తాను అంటూ గట్టిగా కేకలేస్తూ గౌతమ్ పై వాదానికి దిగింది. 

గౌతమ్ కూడా తగ్గలేదు, శోభా శెట్టి పై రెచ్చిపోయాడు. నేను రోజుకి చాలాసార్లు జిమ్ చేస్తా అంటూ జిమ్ బాడీ చూపించడమే కాదు.. అప్పటికప్పుడు బయటికి వెళ్లి శోభా శెట్టిని రెచ్చ గొడుతూ జిమ్ చేసాడు. ఇక మరోపక్క రతిక రచ్చ,  ప్రిన్స్-రతిక ల రొమాన్స్, పల్లవి ప్రశాంత్ దొంగ ఏడుపు ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లో అతిగా రచ్చ రచ్ఛగానే కనిపిస్తుంటే.. మాకు ఏంటి ఈ అతి బాసు అంటూ నెటిజెన్స్ కూడా అడుగుతున్నారు. 

Bigg Boss 7: Sobha Shetty vs Goutham:

Bigg Boss 7: Wednesday episode highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs