Advertisement
Google Ads BL

దేవర పవర్ ఫుల్ యక్షన్ సీక్వెన్స్ స్టార్ట్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లి ఫ్యామిలీతో పాటుగా ఓ ఐదు రోజుల పాటు ట్రిప్ వేసి సోమవారం రాత్రి హైదరాబాద్ కి వచ్చేసారు. ఎన్టీఆర్ చిన్నపాటి బ్రేక్ పూర్తవడంతో కొరటాల ఈ రోజు అంటే సెప్టెంబర్ 20 నుంచి దేవర కొత్త షెడ్యూల్ బిగిన్ చేసారు. శంషాబాద్ లో వేసిన సెట్ లోనే దేవరకి సంబందించిన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని కొరటాల చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

ఈ షెడ్యూల్ లో హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటారని సమాచారం. దేవర షూటింగ్ మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు కొరటాల. పక్కా స్క్రిప్టుతో సెట్స్ మీదకి రావడంతో చిత్రీకరణకు ఎలాంటి అవాంతరాలు రాకపోవడం.. అన్నీ షూటింగ్ శరవేగంగా జరగడానికి కారణమయ్యాయి. 

ఎన్టీఆర్ కూడా చిన్నపాటి బ్రేక్స్ అంటే ఓ ఐదారురోజులు తప్ప షూటింగ్ కి పెద్దగా బ్రేక్ ఇవ్వకపోవడం కూడా కలిసొస్తుంది. ఇక దేవర షూటింగ్ నవంబర్, డిసెంబర్ కల్లా ఫినిష్ అయితే ఎన్టీఆర్ కూల్ గా బాలీవుడ్ మూవీ వార్ 2 సెట్స్ లో వెళ్ళిపోతారని అందుకే కొరటాల దేవర షూటింగ్ చక చకా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. 

Devara powerful action sequence start:

Devara shooting update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs