Advertisement
Google Ads BL

బిగ్ హౌస్ లో రైతు బిడ్డ కన్నీళ్లు


బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. గత రెండు వారాల్లో ఇద్దరు లేడి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అందులో కిరణ్ రావు, షకీలా ఉండగా.. మూడో వారంలోను చాలామంది ఎలిమినేషన్ కి వెళ్లారు. అయితే మూడో వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్ బాస్ నేరుగా అమరదీప్, శోభా శెట్టి, ప్రిన్స్ ని సెలెక్ట్ చేసారు. కానీ ఈ ముగ్గుర్ని కంటెండర్లు గా సెలెక్ట్ చేసినందుకు చాలామంది ఫీలయ్యారు. ముఖ్యంగా రైతు బిడ్డగా హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఎక్కువగా ఫీలయ్యాడు. 

Advertisement
CJ Advs

పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలవగా తాను హౌస్ లో ఓడిపోయాను, తనని ఎంతో కష్టపడి ఈ బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. కానీ నేను బిగ్ బాస్ ముందు ఓడిపోయానంటూ అతిగా ఓవర్ చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. బయట ఒకలా.. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లో మరోలా పల్లవి ప్రశాంత్ బిహేవియర్ ఉంది. తనని ఎంతోమంది పంపెయ్యాలని చూస్తున్నారు అంటూ కన్నీళ్లు కార్చాడు. అయితే మీకు కంటెండర్ అయ్యే సత్తా ఉందా అని బిగ్ బాస్ అడిగితే అది మీకు తెలుసుగా అన్నాడు. ఆ తర్వాత రతికతో గొడవ.. ఆమెని తాకాడు అంటూ రతిక రచ్చ చేసింది.. ఎహె పో అంటూ పల్లవి ప్రశాంత్ ఆమెని తోసేసాడు. 

ఇక రెండో వారంలో ఎలిమినేట్ అయిన షకీలా కూడా పల్లవి ప్రశాంత్ కి పాపులారిటీ ఎక్కేసింది. అది డ్రగ్ లా అతన్ని కమ్మేసింది అన్నట్టుగానే పల్లవి ప్రశాంత్ బిహేవియర్ చాలామంది బుల్లితెర పేక్షకులకి నచ్చడం లేదు. రైతు బిడ్డ అని సింపతీ కొట్టేసే ప్రయత్నంలోనే ఈ ఏడుపు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Pallavi Prashanth crying in Bigg Boss house:

Bigg Boss 7 tuesday episode highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs