సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది ఇకపై ఆమెకి అవకాశాలు కష్టమన్నవాళ్లకు దిమ్మతిరిగే షాకిస్తూ త్రిష ఇప్పటికి బిజీ హీరోయిన్ గా కాదు క్రేజీ హీరోయిన్ గానే కనిపిస్తుంది. మధ్యలో కొన్నాళ్ళు విమెన్ సెంట్రిక్ మూవీస్ కి షిఫ్ట్ అయిన త్రిష ఆ విషయంలో కాస్త అసంతృప్తి గానే వుంది. కానీ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ త్రిషని మరోసారి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసేలా చేసింది.
ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా త్రిష మాత్రం ప్రమోషన్స్ లో చూపించిన గ్లామర్, అందం ఆమెకి మరిన్ని స్టార్ ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. విజయ్, అజిత్, కమల్ ఇలా వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిన వేళ త్రిష పెళ్లి న్యూస్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. గతంలో చెన్నై కి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని దానిని బ్రేకప్ చేసుకున్న త్రిష ఈమధ్యన పెళ్లి చేసుకోబోతుంది అనే న్యూస్ బాగా వైరలవుతోంది.
అది కూడా ఓ మలయాళ ప్రొడ్యూసర్ తో త్రిష డీప్ లవ్ లో ఉందట. ప్రస్తుతం త్రిష లవ్ మేటర్ బయటకి చెప్పకపోయినా.. ఆ నిర్మాతతో త్రిష పెళ్లి విషయాన్ని అతి త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి నిజంగానే త్రిష ప్రేమ పెళ్లి చేసుకోబోతుందా అని ఆమె అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.