Advertisement
Google Ads BL

అప్పుడు తండ్రి ఇప్పుడు కుమార్తె


నిజంగా కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీని చూస్తే పాపం అనాలనిపిస్తుంది. కారణం ఆయన కుమార్తె మీరా ఈ రోజు తెల్లవారుఝామున ఆత్మహత్య చేసుకోవడమే. విజయ్ ఆంటోని కుమార్తె మీరా 12 వ తరగతి చదువుతుంది. అల్లారుముద్దుగా తల్లితండ్రులకి ఒక్క మాట కూడా చెప్పకూండానే ఈ పాప తనువు చాలించడం విజయ్ ఫ్యామిలీకి అత్యంత బాధాకరమైన విషయం. 

Advertisement
CJ Advs

ఇప్పుడే కాదు విజయ్ ఆంటోని తండ్రి విజయ్ ఏడేళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోగా తల్లి తమని ఎంతో కష్టపడి పెంచింది.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు, ఈరోజుల్లో పిల్లలు చదువు వలన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దానిని సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలి, దానికి గల కారణాలు వెతికి వాటిని పరిష్కరించుకోవాలి అంటూ విజయ్ ఆంటోని ఓ ఈవెంట్ లో మట్లాడారు. కానీ ఆయన కుమార్తె మీరా ఇలా డిప్రెషన్ తో కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంది.

విజయ్ ఆంటోని కుమార్తె మీరా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవడంతో ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారని సోషల్ మీడియా టాక్. కానీ ఆ ఒత్తిడిని అధిగమించలేక మీరా ఇలా ఈ రోజు తెల్లవారి ఝామున తన ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించింది. దానితో విజయ్ కుటుంభం తీవ్ర విషాదంలో మునిగిపోగా.. ప్రముఖులు విజయ్ ని పరామర్శిస్తూ ధైర్యాన్ని చెబుతున్నారు. ఆయన అభిమానులు స్టే స్ట్రాంగ్ విజయ్ అన్నా అంటూ సానుభూతి తెలియజేస్తున్నారు. 

Vijay Antony Daughter Meera Dies Suicide :

Vijay Antony Daughter Meera Dies Suicide How Overchome Depression
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs