Advertisement
Google Ads BL

జగ్గు భాయ్ కి ప్రభాస్ భరోసా


సీనియర్ హీరో జగపతి బాబు రీసెంట్ గా రుద్రంగి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేక ఆడలేదు. ప్రస్తుతం విలన్ గా అదిరిపోయే పాత్రలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న జగపతి బాబు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. తాజా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రభాస్ చాలామంచివాడంటూ తన విషయంలో ప్రభాస్ చేసిన పనిని ఆయన పొగిడేశారు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం జగపతి బాబు ప్రభాస్ సలార్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రభాస్ మనసు ఎలాంటిదో గొప్పగా వివరించారు. ప్రభాస్ కి ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు. ఎవరు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాడు. ఒకసారి నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను. ప్రభాస్ తో మాట్లాడాలనిపించి ప్రభాస్ కి ఫోన్ చేశాను. అప్పుడు ప్రభాస్ జార్జియాలో ఉన్నాడు. డార్లింగ్ నేనున్నాను కదా.. నీ ప్రాబ్లెమ్ చెప్పు నేను తీరుస్తాను.. అని చెప్పాడు. 

జార్జియా నుంచి తిరిగి రాగానే ఇంటికొచ్చి మరీ నన్ను కలిసాడు. ఆ సమయంలో ప్రభాస్ ఓదార్పు నాకెంతో ధైర్యాన్నిచ్చింది. నాకన్నా వయసులో చిన్నవాడైనా ప్రభాస్ హృదయం గొప్పది. అందరిని ప్రేమగా చూస్తాడు, ఆదరిస్తాడు అంటూ ప్రభాస్ ని జగ్గూభాయ్ తెగ పొగిడేశారు. 

Jagapathi babu speaks about Prabhas:

Jagapathi babu: At that time Prabhas consoled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs