జైలర్ విడుదలకు ముందు సినిమాపై బజ్ ఎలా ఉన్నా జైలర్ విడుదల తర్వాత సూపర్ స్టార్ మ్యానియా, అనిరుద్ BGM, రజినీకాంత్ స్టైల్, నెల్సన్ మేకింగ్ అన్ని సినిమాకి పాజిటివ్ టాక్ ని తీసుకురావడం కాదు.. ప్యాన్ ఇండియాలో విడుదలైన ప్రతి భాషలోనూ జైలర్ సక్సెస్ ని సాధించి 500 కోట్ల క్లబ్బులో కాలు పెట్టింది. ఈ రేంజ్ హిట్ ని ఆఖరికి సూప్ స్టార్ కూడా ఊహించి ఉండరనుకున్నారు. అనుకున్నట్లే రజినీకాంత్ తాను జైలర్ ఇంత సక్సెస్ అవుతుంది అని ఊహించలేదు అంటూ షాకింగ్ విషయాలని రివీల్ చేసారు.
రీ రికార్డింగ్ కి ముందు జైలర్ ఒక యావరేజ్ సినిమా. కానీ అందరూ నాకు హిట్ అని చెప్పారు. నిజం చెప్పమంటే అందరూ యావేజ్ సర్ అన్నారు. ఆ తర్వాత అది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేతికి వెళ్ళగానే హిట్ కళ వచ్చింది అంటూ జైలర్ సక్సెస్ మొత్తానికి కారణం అనిరుద్ అని సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పేసారు.
అంటే జైలర్ హిట్టుని అఫీషియల్ గా అనిరుద్ ఖాతాలో వేశారు రజినీకాంత్. ఇక ఈ సినిమా ఇంతగా సక్సెస్ అవడంతో నిర్మాతలు సన్ పిక్చర్స్ అధినేతలు రజినీకాంత్ కి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి, దర్శకుడు నెల్సన్ కి కాస్ట్లీ కారులని బహుమతులుగా ఇచ్చిన విషయం తెలిసిందే.