డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు పదే పదే వినిపిస్తూనే ఉంటుంది. గతంలో కూడా నవదీప్ డ్రగ్స్ కేసు విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడంటూ మరోసారి నవదీప్ పేరు హైలెట్ అయ్యింది. హీరో నవదీప్ తనతో పాటుగా ఆ పార్టీలో డ్రగ్స్ సేవించినట్టుగా, అమ్ముతున్నట్టుగా అతని స్నేహితుడు రాంచంద్ నార్కోటిక్ పొలీసులు ముందు వాంగ్మూలం ఇవ్వడంతో అతనికి నార్కోటిక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అంతేకాకుండా నవదీప్ పరారీలో ఉన్నాడంటూ ప్రకటించారు. మరోపక్క నవదీప్ తానెక్కడికి పారిపోలేదని తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని, తనకి డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదని, అసలు తనకి ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పడమే కాకుండా.. నవదీప్ హైకోర్టు కెళ్ళి తన వద్దకి నార్కోటిక్ పోలీసులు రాకుండా, అరెస్ట్ చెయ్యకుండా స్టే తెచ్చుకున్నాడు.
ఈ కేసులో మంగళవారం వరకు నవదీప్ ని అరెస్ట్ చెయ్యొద్దు అని కోర్టు తీర్పునిచ్చింది. కానీ పోలీసులు మాత్రం నవదీప్ ని వదిలేదె లే అంటున్నారు. నవదీప్ డ్రగ్స్ సేవించడమే కాకుండా, అతను డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా ఆధారాలు దొరకడంతో నవదీప్ ఇంటికి వెళ్లి నార్కోటిక్ పోలీసులు సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు నవదీప్ పిటిషన్ కి నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చెయ్యబోతున్నారు.