Advertisement

CBN అరెస్ట్: బండ్ల గణేష్ ఫైర్


చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ ఏపీ తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లోనూ చంద్రబాబు ని ఇష్టపడే తెలుగు వారంతా ఏకతాటిపైకి వచ్చి రోడ్డు మీద నడుస్తూ ధర్నాలు చేస్తున్నారు. కేవలం టీడీపీ నేతలే కాదు.. పలు పార్టీలకి చెందిన నేతలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై మాట్లాడుతున్నారు. ఇప్పటికే బీజేపీ, జనసేన చంద్రబాబు అరెస్ట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

Advertisement

హైదరాబాద్ లో ఐటి ఉద్యోగులు గత వారం రోజులుగా రోడ్డు పైకి వచ్చి చంద్రబాబుని విడుదల చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా KBR పార్క్ దగ్గర ఐటి ఉద్యోగులు, వాకర్స్ చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ ప్లకార్డ్ ప్రదర్శన చేసారు. కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఈ ధర్నాలో పాల్గొనడమే కాకుండా.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు తెలుగుజాతి సంపద. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వారికి ఉంది. తెలుగు వారికి సిగ్గు లేదు, KBR పార్క్, అమెరికాలో కూర్చుని, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ పై ధర్నాలు చెయ్యడం కాదు.. వీరంతా సొంత ఊళ్ళకి వెళ్లి రచ్చబండ దగ్గర గట్టిగా తమ నాయకుడిని విడుదల చెయ్యాలని నిరసన చెయ్యాలి. నేను కాంగ్రెస్ లో ఉన్న నాకే చంద్రబాబు అరెస్ట్ అయ్యారంటే చాలా బాధగా ఉంది. కనీసం వినాయకచవితి పండుగ కూడా చేసుకోలేదు.

చంద్రబాబు పేరు వాడుకుని ఎందరో లబ్ది పొందారు. తండ్రి లాంటి బాబు జైల్లో మగ్గుతుంటే అన్నం తినబుద్ధి కావడం లేదు. భువనేశ్వరి గారు నాకు అమ్మలాంటిది. అమ్మలాంటి ఆమె బాధపడడం చూసి నా మనసు తరుక్కుపోతుంది. బాబు గారు నాలుగురోజులు తర్వాత అయినా బయటికొస్తారు. అప్పుడు మళ్ళీ శాసిస్తారు. బాబు గారు అర్ధం చేసుకోండి.. మనవాళ్లెవరో పరాయివాళ్లెవరో అనేది అంటూ బండ్ల గణేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఈ ధర్నాలో మైసూరా రెడ్డి పాల్గొనటం విశేషం. 

CBN Arrest: Bandla Ganesh Fire:

Bandla Ganesh Fires on Chandrababu Naidu Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement