మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులర్ అయిన విజయ్ ఆంటోని ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాల్లో నటించారు. బిచ్చగాడు ఆయనకి హీరోగా బిగ్ బ్రేక్ నిచ్చింది. ఆ సినిమాతో విజయ్ ఆంటోని హీరోగా సెటిల్ అయ్యారు. అప్పటినుంచి బిచ్చగాడు 2, హత్య ఇలా ప్రతి సినిమాను ఆయన తెలుగులోనూ విడుదల చేస్తూ తెలుగు ప్రజలకి చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన గత చిత్రం బిచ్చగాడు రీ రిలీజ్ కి సిద్ధమైంది.
విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ ఆంటోని కుమార్తె టీనేజ్ అమ్మాయి. 12 వ తరగతి చదువుతున్న మీరా అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమెని కుటుంభ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపులోనే మరణించడం అత్యంత బాధాకరమైన విషయం.
అయితే మీరా సూయిసైడ్ కి కారణం తీవ్ర ఒత్తిడి అంటున్నారు. ఆ అమ్మాయి ఒత్తిడిని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు విజయ్ ఆంటోనికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.